స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

9 Feb, 2015 01:38 IST|Sakshi

 సాక్షి,హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా నల్లగొండ జిల్లాకు చెందిన గర్భిణి పర్విన్(32) శనివారం రాత్రి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందా రు. తీవ్ర జ్వరంతో ఈ నెల ఐదో తేదీన ఆమె ఆస్పత్రిలో చేరారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 2,302 నమూనాలు పరీక్షించగా, వీటిలో ఇప్పటివరకు 768 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గాంధీలో ప్రస్తుతం 33 మంది పాజిటివ్, 44 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఫీవర్‌లో 9 పాజిటివ్, 20 మంది అనుమానితులు చికిత్స చేయించుకుంటున్నారు. వివిధ ఆస్పత్రుల్లో మరో పది మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
 

మరిన్ని వార్తలు