జెడ్పీ, మండల ఎన్నికలకు రంగం సిద్ధం

24 Feb, 2019 04:42 IST|Sakshi

మార్చి 27 కల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి

మార్చి 16నుంచి డ్రాఫ్ట్‌ జాబితాలు సిద్ధం చేసుకోవాలి

డీపీఓలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మే నెల చివరికల్లా  ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు అవసరమైన సంసిద్ధతను ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  (ఎస్‌ఈ సీ) తెలియజేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 27 లోగా రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయ తీల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితా లను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీఓ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఆదేశించారు.  రాష్ట్రం లోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించేలా చర్యలు తీసుకోవా లని శనివారం  ఎస్‌ఈసీ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు పీఆర్‌శాఖ ముఖ్యకార్య దర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (హైదరాబాద్‌ మినహా), సీఈఓలు, ఎంపీడీఓలకు సమాచారం పంపించారు.

2019 జనవరి 1 కల్లా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరున్న వారిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఈ నెల 22న ›ప్రకటించిన (2019 జనవరి 1 ప్రాతిపదికగా) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా వాటిని తయారు చేయాలని నాగిరెడ్డి సూచించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో సూచిం చిన మేరకు వార్డుల విభజన పూర్తి చేయాలని నిర్దేశించారు. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ను మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా మండలాల స్థాయిల్లో ఎంపీడీఓలు, జిల్లా పరిషత్‌ల స్థాయిలో సీఈఓ లు  చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఓటర్ల జాబితాలను సంబంధిత మండల, జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుం ది. వచ్చేనెల 27న ఫోటోలతో కూడిన గ్రామ పంచాయతీ  ఓటర్ల జాబితాను ప్రదర్శించాక, నోటిఫికేషన్‌ వెలువడే నాటికి అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఏవైనా చేర్పులు, తీసివేతలు లేదా సవరణల విషయంలో ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారి ఆదేశాలు ఇచ్చి ఉంటే వాటిని కూడా డీపీఓలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుం దని స్పష్టంచేశారు. ఆ మేరకు సంబంధిత గ్రామపంచాయతీ వార్డుల ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని సూచించారు. 

జెడ్పీ,ఎంపీటీసీ ఎన్నికలు ఇలా...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల(పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్‌ మినహాయిం చి) ప్రాతిపదికన  జిల్లా, మండల ప్రజాపరిష త్‌ల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక  నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను ముం దుగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు  వీలుగా జెడ్పీ టీసీలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల  పునర్విభజన పూర్తి చేయాలని   పంచాయతీ రాజ్‌ శాఖ ఆదేశించడంతో దానిపై జిల్లా కలెక్టర్లు చేసిన కసరత్తు పూర్తికావొచ్చింది.  కొత్త గా ఏర్పాటైన రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణపై క్షేత్రస్థాయి పరిస్థి తులు పరిగణనలోకి తీసుకుని వీటిని పూర్తి చేస్తు న్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధం కాగానే పోలిం గ్‌స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత జెడ్పీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారు.  నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికల తేదీలు ప్రకటిస్తారు.

ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఇదీ షెడ్యూల్‌
- మార్చి 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ  ముసాయిదా (డ్రాఫ్ట్‌) ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి  గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ప్రదర్శించాలి
మార్చి 17–20 తేదీల మధ్య గ్రామీణ అసెంబ్లీ ఓటర్లను వార్డులు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చడం పట్ల ఏవైనా అభ్యంత రాలుంటేస్వీకరణ
​​​​​​​- మార్చి 18న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారుల సమావేశం
​​​​​​​- మార్చి 19న మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓల సమావేశం
​​​​​​​- మార్చి 23న ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని డీపీఓలు పరిష్కరించాలి
​​​​​​​- మార్చి 27న డీపీఓలు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి
​​​​​​​- మార్చి 30న మండల ప్రజా పరిషత్‌ పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ఎంపీడీఓలు,  జిల్లా పరిషత్‌ పరిధిలోని జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల (జెడ్పీటీసీ) వారీగా ఫోటో ఓటర్ల జాబితాను సీఈఓలు, తయారు చేసి సంబంధిత మండల, జిల్లా పరిషత్‌ కార్యా లయాల్లో బహిరంగంగా ప్రదర్శించాలి. 

మరిన్ని వార్తలు