రాష్ట్రపతి నోట హైదరాబాద్‌ బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి..!

19 Dec, 2017 19:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ‘సోదరసోదరిమణులారా నమస్కారం. దేశభాషలందు తెలుగు లెస్స’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం ప్రారంభంలో కొంత తెలుగులో మాట్లాడారు. ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాలు మంగళవారం ఎల్బీస్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆంగ్లంలో ప్రసంగిస్తూ.. తెలుగుభాష ఔనత్యాన్ని, తెలుగు సాహిత్య తేజోమూర్తులను, తెలుగు సంస్కృతీ-సంప్రదాయాల ఉన్నతి ప్రస్తావించారు. పలువురు తెలుగు కవులను, వారి సేవలను గుర్తుచేశారు. ఆయన ఏమన్నారంటే..

  • తెలుగుభాషకు ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది.
  • తెలుగు సాహిత్యవ్యాప్తి శ్రీకృష్ణదేవరాయులు ఎంతో కృషి చేశారు
  • దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగు
  • మాజీ రాష్ట్రపతులు ఎస్‌ రాధాకృష్ణన్‌, వీవీ గిరి, నీలం సంజీవరావు తెలుగు తెలిసినవారు
  • బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే
  • స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివి
  • పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు
  • ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు
  • దేశవిదేశాల్లో తెలుగువారు ఎంతో ఖ్యాతి గడించారు
  • హైదరాబాద్‌ అనేక సంస్కృతులకు కేంద్రంగా నిలిచింది
  • హైదరాబాద్‌ బిర్యానీకి, బ్యాడ్మింటన్‌, బాహుబలికి ప్రసిద్ధి
  • రాష్ట్రపతిగా తెలంగాణలో ఇదే మొదటి పర్యటన
  • 18 రాష్ట్రాల్లో, 42 దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలుగువారే కావడం ఆనందదాయకం
  • 2008లో తెలుగుభాషకు చారిత్రక భాష గుర్తింపు
  • నన్నయ్య, తిక్కన మొదలగు కవులు భారతాన్ని తెలుగులోకి అనువదించారు
  • గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి వంటి కవులు తెలుగుభాషను సుసంపన్నం చేశారు
  • గిరజన హక్కుల కోసం పోరాడిన కొమ్రం భీమ్‌ వంటి వీరులు కన్న భూమి ఇది
  • తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక శుభాకాంక్షలు
     

ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అనే గేయాన్ని ఉటంకించి రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు

మరిన్ని వార్తలు