జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు

9 Jan, 2016 02:21 IST|Sakshi
జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
నిజామాబాద్ సిటీ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (టీఈఎంజేయూ) జిల్లా మహాసభలో ఆయన ప్రసంగించారు. జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు వస్తాయన్నారు. రాను న్న రోజుల్లో యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి తాను తప్పుకుంటానని, అప్పటివరకు మీ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, డాక్టర్ భూపతిరెడ్డి, టీఈఎం జేయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, జమల్‌పూర్ గణేశ్, మధుసూదన్‌రావు, కోశాధికారి సాగర్, రాష్ట్ర నాయకులు శివాజీ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బాలార్జున్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
 
టీఈఎంజేయూ జిల్లా నూతన కమిటీ
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియ న్ జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధా న కార్యదర్శిగా రవీందర్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భాస్కర్, కోశాధికారిగా కిషోర్, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, రాము, హరీశ్, రామకృష్ణ, ఆనంద్‌పాల్, నవీన్, యూనస్, సతీశ్, అనిల్, వజి య్, తారాచంద్, సహాయ కార్యదర్శులుగా నాందేవ్, మురళి, కృష్ణాచారి, సతీష్‌గౌడ్, తారాచాంద్, బస్వారాజు, సదానంద్, శ్రీనివాస్, సయ్యద్ జకీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మధుసూదన్‌రెడ్డి, గోపాల్, సాయి, రమేశ్, నవీన్, అర్షద్, రాము, శ్రీనివాస్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా వేణు, ప్రమోద్, నవీన్, విజయ్, అఫ్సర్, శ్రీనివాస్, నవీన్, కిషోర్ నియమితులయ్యారు.

>
మరిన్ని వార్తలు