కొనలేం..

24 Aug, 2015 04:59 IST|Sakshi
కొనలేం..

 ఖమ్మం వ్యవసాయం : నిత్యావసర వస్తువుల ధరలు భారీ గా పెరిగారుు. పేద, మధ్యతరగతికి అందనంత ఎత్తులో రేట్లు ఉన్నారుు. పప్పుల ధరలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ఉల్లి ధర నాలుగు రెట్లకు పైగా పెరిగింది. మంచినూ నె ప్రియమైంది. చింతపండు, వేరుశనగ లు, మిరప కాయలు వంటి వాటి ధరలు కూడా పెరిగాయి. కూరగాయల ధరలు కూడా మండిపోతున్నారుు. పెరుగుతున్న ధరలను ప్రభుత్వం అదుపు చేయలేకపోతుందనే విమర్శలు వస్తున్నా యి. ఉల్లిగడ్డ, కంది పప్పులను కొంత మేర కు సబ్సిడీ ధరలకు అందించే ప్రయత్నం చేస్తున్నా అవి పల్లెవాసులకు అందడం లేదు. అక్కడక్కడ డివిజన్ కేంద్రాల్లో విక్రరుుస్తున్నారు.

 ‘పప్పు’లుడకట్లే..
 పప్పుధరలు మూడురెట్లు పెరగడంతో ఎవరూ వాటిని వండుకునే సాహసం చేయలేకపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పప్పుల ధరలు పెరిగాయి. తొలుత పెసర పప్పు ధర పెరిగింది. గత జనవరికి ముందు పెసర పప్పు రూ.60 నుంచి రూ.70 వరకు పలికింది. ఈ ధర క్రమంగా పెరిగింది. కంది పప్పు పరిస్థితి ఇంతే. నాణ్యతను బట్టి రూ.50 నుంచి రూ.60 పలికిన కంది పప్పు ధర ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఆరు నెలల క్రితం రూ.60 వరకు ఉన్న మినప పప్పు ప్రస్తుతం రెట్టింపు ధర పలుకుతుంది. రూ.40 ఉన్న శనగపప్పు ధర దాదాపు రెట్టింపైంది.

 కొనబోతే కన్నీరు..
 ఉల్లి రేటు వింటేనే కన్నీరొస్తోంది. గత వేసవిలో రూ.10 ఉన్న ఉల్లి ధర ఆ తర్వాత రూ.15కు చేరింది. ఇప్పుడు ఏకంగా బహిరంగమార్కెట్లో రూ.50 పలుకుతోంది. ఇది రూ.100కు కూడా చేరే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. నూనెల విషయూనికొస్తే ఆరునెలల క్రితం వేరుశెనగ నూనె రూ.80 నుంచి 90 పలికింది. ప్రస్తుతం కిలో ఒక్కంటికి రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. రూ.70 ఉన్న పొద్దుతిరుగుడు మరో రూ.20 మేర పెరిగింది. పామారుుల్ ధర కూడా కొంత పెరిగింది. చింతపండు, కారం, వేరుశనగ గింజలు, అల్లం, వెల్లుల్లి వంటి వాటి ధరలు పెరిగాయి. చింతపండు ధర వేసవిలో రూ.50 ఉంటే ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతోంది. రూ.70 నుంచి రూ.80 వరకు ఉన్న కారం ధర కూడా రెట్టింపైంది.

 పంటల సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం
 వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. పంటలు రైతుల చేరుుదాటాక విపరీతంగా ధర పెరుగుతోంది. ప్రజల వినియోగం, మార్కెట్‌లో సరుకు నిల్వల ఆధారంగా ధరలను పెంచుతున్నారు. మన జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే కంది సాధారణ సాగు విస్తీర్ణం 10 వేల ఎకరాలు కాగా 5 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. పెసర 15 వేల ఎకరాలు కాగా 12 వేల ఎకరాల్లో మాత్రమే వేశారు. వేరుశనగ 1500 ఎకరాలకు గాను కేవలం 500 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ఆహార పంటల సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. తత్ఫలితంగా ధరలు పెరుగుతున్నారుు.

 ప్రత్యామ్నాయ చర్యలు నామమాత్రం
 నిత్యావసరాల ధరలు పెరుగుతాయనే విషయూన్ని ముందుగానే పసిగట్టి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. కానీ నామమాత్రపు చర్యలకే ప్రభుత్వం పరిమితమైంది. పెరిగిన ధరల నియంత్రణ చర్యలు కూడా చేపట్టడం లేదు. ఉల్లిగడ్డలు, కంది పప్పును మాత్రం సబ్సిడీపై నామమాత్రంగా అందిస్తోంది. ఉల్లిగడ్డలను రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో విక్రయించాలని నిర్ణయించింది. డివిజన్ కేంద్రాల్లో కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా ఒకటి, రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. నిజానికి పేద ప్రజలుండే గ్రామాల ను ప్రభుత్వం విస్మరించింది. రేషన్ షాపుల నుంచి ఇచ్చే కంది పప్పును కూడా అన్ని ప్రాంతాల్లో సక్రమంగా అందించటం లేదు.

మరిన్ని వార్తలు