‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది’

19 Mar, 2020 20:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్‌ సమర్ధించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. ఇక శ్రీరామ నవమికి ఈ ఏడాది భక్తులు తమ గుండెళ్లో కొలుచుకోవాలన్నారు.

వచ్చే ఏడాది శ్రీరామనవమి నాడు రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహించుకుందామని ఆయన భక్తులకు సూచించారు. అదేవిధంగా చిలుకూరు ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేయడం తనకు బాధగానే ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాన అర్చకులు రంగారాజన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు