నీటి కొరత ఉందని ఓ ప్రిన్సిపాల్‌ దారుణం..!

14 Aug, 2019 08:16 IST|Sakshi

నీళ్లు కట్‌..జుట్టు కట్‌..!

నీటి కొరత సాకుతో ‘మెదక్‌’లో ఓ ప్రిన్సిపాల్‌ నిర్వాకం  

సాక్షి, మెదక్‌ జోన్‌: గురుకులంలో నీటి ఎద్దడి ఉందనే సాకుతో ఓ ప్రిన్సిపాల్‌ విద్యార్థినుల జుట్టు కత్తిరింపజేసిన ఉదంతం మెదక్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్‌ పట్టణంలోని మినీ గురుకులంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యారి్థనులు ఉన్నారు. వారి వసతి గృహానికి నీటిని సరఫరా చేసే బోరుబావి ఏప్రిల్‌లో ఎండిపోయింది. దీంతో నీటి సమస్య తీవ్రంగా మారింది. మూడ్రోజులకోసారి రూ.600 వెచి్చంచి ట్యాంకర్‌ ద్వారా నీటిని తెప్పిస్తున్నారు.

ఈ క్రమంలో విద్యార్థినులతల వెంట్రుకలు పెద్దగా ఉండడంతో నీటిఖర్చు అధికమవుతుందని భావించిన ప్రిన్సిపాల్‌ అరుణారెడ్డి తల్లిదండ్రులకుగానీ, పాఠశాల కమిటీకి గానీ సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 9న విద్యారి్థనుల జుట్టు కత్తిరింపజేసి వాటిని విక్రయించారు. విషయం బయటికి పొక్కడంతో మరుసటి రోజు కొంతమంది తల్లిదండ్రులు గురుకులం వద్ద ఆందోళన చేశారు. దీంతో ప్రిన్సిపాల్‌ తమ సిబ్బందిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మంగళవారం మరి కొంతమంది సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్‌ గది నుంచి బయటికి రాలేదు.   ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా నీటిసమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని తెలిపారు.   

మరిన్ని వార్తలు