న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యత

17 Oct, 2018 01:45 IST|Sakshi

పూర్తి స్థాయి మేనిఫెస్టోలో పలు పథకాలు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని  మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత న్యాయవాదుల కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టామని, త్వరలో పార్టీ ప్రకటించే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు పథకాలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ మెంబర్లతోపాటు తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు.

తెలంగాణ అడ్వొకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్టుకు మరిన్ని నిధులు కేటాయించాలని, ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్‌కార్డులు జారీ చేయాలని న్యాయవాద ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ల ప్రతిపాదనలను కేటీఆర్‌కు సమర్పించారు. మేనిఫెస్టోలో న్యాయవాదులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. మేని ఫెస్టో కమిటీకిడిమాండ్ల ప్రతిని ఇస్తామన్నారు.

మరిన్ని వార్తలు