అక్రమాలకు ఆస్కారం లేకుండా..

3 Jan, 2015 04:10 IST|Sakshi
అక్రమాలకు ఆస్కారం లేకుండా..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులకు సవాలే నిలిచాయి. గతేడాది ఇంటర్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. ప్రైవేట్ కళాశాలల యా జమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారన్న ఆరోపణలు వచ్చాయి. మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు ఏకంగా అప్పటి ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషి, జేసీ వెంకటేశ్వర్‌రావులు నిజామాబాద్ కాకతీయ జూనియర్ కాలేజీలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ కళాశాల అధినేతను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించడం చర్చనీయాశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కూడ పలుచోట్ల ఇంటర్ పరీక్షల నిర్వహణ  వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఇంటర్  సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్, మార్చి 9 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో ముందస్తు ప్రణాళికపై  ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ తనిఖీ అధికారి ఎ.విజయ్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లో..
 
మూత పడిన 20 కాలేజీలు..
జిల్లాలో మొత్తం 163 ఇంటర్ కాలేజీలు ఉంటే అందులో ఈ ఏడాది 143 కళాశాలల విద్యార్థులే పరీక్షలకు హాజరవుతున్నారు. గత రెండు మూడేళ్లుగా 20 కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది నిజామాబాద్‌లో విశ్వభారతి, బాన్సువాడలో ప్రగతి కాలేజీలను మూసేశారు. 31 ప్రభుత్వ, 4 ఎయిడెడ్ కళాశాలు, 15 మోడల్ స్కూల్స్, 13 సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల కళాశాలతో పాటు 80ప్రైవేట్ కళాశాల విద్యార్థులు 60,592 ఈసారి పరీక్షలు రాయనున్నారు.
 
పకడ్బందీ ఏర్పాట్లు..
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్చి 9 నుంచి జరిగే ఇంటర్ ప్రథ మ, ద్వితీయ పరీక్షలకు ఇప్పటి నుంచే పకబ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్ర భుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను ‘జంబ్లింగ్’ పద్ధతిన ఏర్పా టు చేయనున్నాము. ఉదాహరణకు నిజామాబాద్‌లో 18 కాలజీలుంటే వాటి ని మూడు జోన్లుగా విభజించి ఏ కాలేజీలో చదివే పిల్లలు ఆ కాలేజీలో పరీక్ష రాసే అవకాశం ఉండకుండా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తాము. గతంలో ఆరోపణలు వచ్చిన కళాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాము.
 
పరీక్షల నిర్వహణపై సమావేశం...
ఇంటర్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో ఓ స మావేశం నిర్వహించనున్నాము. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల నిర్వాహకు లు హాజరయ్యే విధంగా ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నాము. 143 ప్ర భుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ఏ సెంటర్‌లో పరీక్ష రాయాల్సి వచ్చి నా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేది సూచిస్తాము. కళాశాలల నిర్వాహకులు ఖచ్చితంగా హాజరయ్యేలా ప్రణాళికబద్ధంగా నిర్వహించే సమావేశం పరీక్షలకు కీలకం కానుంది.
 
ప్రాక్టికల్స్ ఎక్కడికక్కడే..
ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 12న ముగిసింది. ఈ లె క్కన 29,250 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం పరీక్ష రాయనుండగా, 31,342 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. అ యితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజీలోనే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఉంటాయి. కేవలం రాత పరీ క్షలు మాత్రమే ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు జంబ్లింగ్ పద్ధతిలో ఉంటాయి.
 
’కాపీయింగ్’పై తల్లిదండ్రుల వ్యతిరేకత
ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ‘విద్యార్థులకు జలుబు పడితే తల్లిదండ్రులకు తుమ్ములు వస్తున్నాయి’. తమ పిల్లల భవిష్యత్‌పై కలలుకంటున్న వారు కాపీయింగ్‌ను కోరుకునే పరిస్థితిలో అసలే లేరు. అయితే కొన్ని విద్యాసంస్థలు ర్యాంకుల కోసం గతంలో ఈ పద్ధతులు అవలంభించినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా అందరి సహకారంతో అవకతవకలకు అస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాము.
 
అవకతవకలకు పాల్పడితే ఇంటికే..
ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. పిల్లలు ఉత్తములుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు అనేక వ్యయప్రయాసాలకు సిద్ధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల్లో అవకతవకలకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తాము. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆ సబ్జెక్టుకు సంబంధించిన బోధకులకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు ఇవ్వం. ఇన్విజిలేట ర్లు అక్రమాలకు అవకాశం కల్పిస్తే ఇంటికి పంపడం ఖాయం. ఈ పరీక్షల్లో  400 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లను వినియోగించనున్నాము.

మరిన్ని వార్తలు