‘మెదక్‌ నుంచి పోటీచేస్తే గెలిపిస్తాం’

25 Jan, 2019 05:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ప్రియాంక లేదా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు మెదక్‌ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కుటుంబం నుంచి పోటీ చేస్తే ఏకగ్రీవం చేయించే బాధ్యతను సీఎం కేసీఆర్‌ తీసుకోవాలని, బీజేపీని కూడా ఆయనే ఒప్పించాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావడంలో రాహుల్‌ గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. ప్రియాంకలో ఇందిరాగాంధీ కనపడుతుం దని, ఆమె ప్రభావం దేశ వ్యాప్తంగా పనిచేయడంతోపాటుగా కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుతుందని తెలిపారు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఆయన్ను వ్యతిరేకిస్తే రాహుల్‌గాంధీని, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు.  

మరిన్ని వార్తలు