ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి

1 Dec, 2019 03:39 IST|Sakshi

ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా మౌనదీక్ష 

హైదరాబాద్‌: ప్రియాంకారెడ్డిపై జరిగిన అఘాయిత్యం పట్ల రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి మహమూద్‌ అలీలు బాధ్యతారహితంగా హేళనగా మాట్లాడటం సమంజసం కాదని, దీనికిగానూ తక్షణమే వారిద్దరూ క్షమాపణ చెప్పాలని మాజీ మం త్రి, బీజేపీ నాయకురాలు డి.కె.అరుణ డిమాండ్‌ చేశారు. శనివారం బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ధర్నాచౌక్‌ వద్ద మౌనదీక్ష నిర్వహించింది. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని, మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్‌ చేసింది. మౌనదీక్షకు ముందు జరిగిన సభలో డి.కె.అరుణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు, హత్యలు, యాసిడ్‌ దాడు లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు