28 నిమిషాల్లోనే చంపేశారు!

30 Nov, 2019 02:00 IST|Sakshi
శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సీపీ సజ్జనార్‌. చిత్రంలో డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తదితరులు

ప్రియాంకారెడ్డిపై సామూహిక లైంగికదాడి, హత్య

పథకం ప్రకారమే ఘాతుకానికి పాల్పడిన లారీ డ్రైవర్లు, క్లీనర్లు

గొంతు, నోరు, ముక్కు నొక్కడంతో మృతి చెందిన ప్రియాంక

లారీ కేబిన్‌లో శవాన్ని వేసుకుని చటాన్‌పల్లి వైపు తీసుకెళ్లిన నిందితులు

మృతదేహానికి దుప్పటి చుట్టి బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి దహనం

సూత్రధారి ఆరిఫ్‌.. సహకరించిన శివ, నవీన్, చెన్నకేశవులు

నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు

ఫిర్యాదుపై పోలీసులు వేగంగానే స్పందించారన్న సీపీ సజ్జనార్‌

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదిం చారు. తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద లారీ నిలిపిన డ్రైవర్లు, క్లీనర్లే ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసినట్టు నిర్ధారించారు. ప్రియాంకను లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం అంతా 28 నిమిషాల్లోనే జరిగిపోయింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌.. డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌ డీసీపీ కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ‘మహిళ కనిపించడంలేదం టూ 28న ఫిర్యాదు వచ్చింది. వెంటనే మిస్సింగ్‌ కేసు నమోదు చేసి అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారమిచ్చాం. అదేరోజు షాద్‌నగర్‌ హైవేలో మహిళ కాలిన మృతదేహం ఉందన్న సమాచారం వచ్చింది. 

ప్రియాంక తల్లిదండ్రులు శవం తమ కుమార్తెదేనని నిర్ధారించడంతో దర్యాప్తు వేగవంతం చేశాం. నలుగురు నిందితులు.. ఏ–1 మహమ్మద్‌ ఆరిఫ్‌ (26), ఏ–2 జొల్లు శివ (20), ఏ–3 జొల్లు నవీన్‌ (20), ఏ–4 చింతకుంట చెన్నకేశవులు (20) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించాం. వారంతా లారీ డ్రైవర్లు, క్లీనర్లే. వీరిలో మహమ్మద్‌ ఆరిఫ్‌ది నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌ గ్రామం కాగా.. శివ, నవీన్, చెన్నకేశవులది అదే మండలంలోని గుడిగండ్ల గ్రామం. వీరిలో ఆరిఫ్, చెన్నకేశవులు డ్రైవర్లు, నవీన్‌–శివ క్లీనర్లు. వీరు కర్ణాటక నుంచి బుధవారం ఉదయం లోడు తీసుకుని ఉదయం 9 గంటలకు శంషాబాద్‌లోని తొండుపల్లి టోల్‌గేట్‌కు వచ్చారు. కానీ, ఆ సమయంలో నగరంలోకి అనుమతి లేకపోవడం, సరుకు డెలివరీ చేయాల్సిన ఓనర్‌ అందుబాటులో లేకపోవడంతో నలుగురూ అక్కడే ఉండిపోయారు. 

ప్రియాంకను చూడగానే దుర్బుద్ధి..!
బుధవారం సాయంత్రం 6.15 గంటలకు తొండు పల్లి గేట్‌ వద్దకు వచ్చిన ప్రియాంకారెడ్డి.. టోల్‌గేట్‌ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో సబ్‌రోడ్డు సమీపంలో తన స్కూటీ పార్క్‌ చేసింది. ఆ మధ్యాహ్నం నుంచి అక్కడే మద్యం తాగుతూ ఉన్న నిందితులకు ప్రియాంకను చూడగానే దుర్బుద్ధి పుట్టింది. ఆమె తిరిగి రాగానే లైంగిక దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా నవీన్‌ ఆమె స్కూటీ పంక్చర్‌ చేయాలని ఐడియా ఇచ్చా డు. రాత్రి 9.15 గం.కు ప్రియాంక అక్కడకు రావడంతో ఆరిఫ్‌ వెళ్లి స్కూటీటైరు పంచరైందని చెప్పా డు. తాము బాగు చేయించి తీసుకొస్తామని నమ్మబలికాడు. వారంతా 20 ఏళ్లలోపు వారే కావడంతో ప్రియాంక వారిని నమ్మింది. 9.30 గంటలకు బం డి తీసుకెళ్లిన శివ.. షాపు మూసి ఉందని తిరిగి వచ్చాడు. మరో పంక్చర్‌ దుకాణానికి వెళ్లాలని ఆరిఫ్‌ చెప్పడంతో శివ మళ్లీ బండి తీసుకుని వెళ్లా డు. ఇంతలో ఆరిఫ్‌.. ప్రియాంక చేతిని పట్టుకుని లాగాడు. నవీన్, చెన్నకేశవులతో కలిసి లారీ నిలిపిన నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను ఎత్తుకెళ్లారు. 

ఈలోపు శివకు సమాచారం ఇవ్వడంతో అతడూ అక్కడికి వచ్చాడు. అంతా కలిసి ప్రియాం కపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె నోరు, గొంతు, ముక్కు మూయడంతో 10.08 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. వెంటనే మృతదేహాన్ని టీఎస్‌07 3335 నంబర్‌ గల లారీ కేబిన్‌లో వేశారు. 10.13 గంటలకు ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో వెళ్లగా.. ప్రియాంక స్కూటీపై శివ, నవీన్‌లు ముందు షాద్‌నగర్‌ వైపు వెళ్లారు. నంది గామ వద్ద పెట్రోల్‌ బంకులోకి వెళ్లి విడిగా పెట్రోల్‌ కావాలని అడిగారు. వారు ఇవ్వడానికి నిరాకరించడంతో సమీపంలోని కొత్తూరు బంకు లో పెట్రోలు కొనుగోలు చేశారు. అనంతరం షాద్‌నగర్‌ వద్దకు వెళ్లినా.. యూటర్న్‌ తీసుకుని వెనక్కి వచ్చారు. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు రాగానే.. కేబిన్‌లో నుంచి శవాన్ని దించారు. తెల్లవారుజామున 2 నుంచి 2.30 గంటలకు మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి పెట్రోల్, లారీ నుంచి తీసిన డీజిల్‌ పోసి నిప్పం టించారు. 

సగం దూరం వెళ్లి.. అనుమానంతో మళ్లీ వెనక్కి వచ్చారు.. శవం కాలిందని నిర్ధారించుకున్నాక తిరిగి బయల్దేరారు. మార్గమధ్యంలో కొత్తూరు వద్ద ప్రియాంక స్కూటీని వదిలిపెట్టారు. ఆధారాలు దొరక్కుండా అప్పటికే ఆ బండి నంబర్‌ ప్లేటును చటాన్‌పల్లి వద్దే పీకేశారు. అనంతరం ఉదయం 3 గంటల సమయంలో ఆరాంఘర్‌ చేరుకున్నారు. ముగ్గురు నిందితులు ఇంటికి వెళ్లగా.. ఆరిఫ్‌ మాత్రం నగరానికి వెళ్లి లారీ అన్‌లోడ్‌ చేశాడు’’అని సీపీ వివరించారు. కేసులో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని, నిందితులను ఇంకా విచారించాల్సి ఉందన్నారు. మిస్సింగ్‌ కేసును ఐపీసీ 302, 376డి సెక్షన్ల కింద మార్చినట్లు వెల్లడించారు. 

ప్రియాంక కుటుంబ సభ్యులు

నిర్లక్ష్యం లేదు..
ప్రియాంక హత్య అనంతరం పోలీసులు ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించలేదని సీపీ సజ్జనార్‌ స్పష్టంచేశారు. ఆమె తల్లిదండ్రులు శంషాబాద్‌ పీఎస్‌కు 11 గంటల సమయంలో వచ్చారని, 11.25 నిమిషా లకు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. 12 గంటలకు పెట్రోలింగ్‌ సిబ్బంది టోల్‌గేట్‌ వద్దకు వెళ్లారని, అయితే ఏ టోల్‌గేట్‌ నుంచి ఆమె వచ్చిందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టిందన్నారు. సీసీ ఫుటేజీలో ఆమె వెళ్లడమే ఉంది గానీ, రావడం లేకపోవడంతో గాలింపునకు 10 బృందాలను రంగంలోకి దించినట్టు చెప్పారు. ఉదయం 3 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, తెల్లవారుజామున 5 గం టల వరకు ప్రియాంక తండ్రితో కలిసి అన్ని బం కులు, పంక్చర్‌ షాపుల్లో గాలించినట్టు వివరించా రు. పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపిస్తామని, తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు.

నిందితులు ప్రియాంకను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్న గది ఇదే   

డయల్‌ 100కి ఫోన్‌ చేయండి..
మహిళలు, చిన్నారులు ఎవరైనా సరే.. బండి పాడైనా, పెట్రోల్‌ అయిపోయినా.. వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. లేకుంటే హాక్‌ ఐ, వాట్సాప్, ఫేస్‌బుక్‌ ఎవరికి అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రియాంక ఫోన్‌ ఏమైంది?
బుధవారం రాత్రి 9.48 గంటలకు ప్రియాంకారెడ్డి ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. ఇంతవరకూ ఆమె ఫోన్‌ దొరకలేదు. నిందితులతో పెనుగులాటలో అక్కడే ఎక్కడైనా పడిపోయిందా లేక ఆధారాలు దొరక్కుండా చేసేందుకు నిందితులే ధ్వంసం చేశారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సీపీ కూడా ఆమె ఫోన్‌ దొరకలేదని, దర్యాప్తులో తెలుస్తుందని పేర్కొన్నారు.

తొండుపల్లి నుంచి చటాన్‌పల్లి వరకు...
► ఉదయం 9.00 గంటలకు నిందితుల లారీ టోల్‌గేట్‌ వద్దకు వచ్చింది.
► సాయంత్రం 6.15కు గచ్చిబౌలి వెళ్లేందుకు తొండుపల్లి టోల్‌గేట్‌ వద్దకు ప్రియాంకారెడ్డి స్కూటీపై వచ్చింది.
► 6.30 గంటలకు నిందితులు ఆమె స్కూటీ ని పంక్చర్‌ చేశారు.
► రాత్రి 9.13 గంటలకు టోల్‌గేట్‌ వద్దకు వచ్చిన ప్రియాంకకు స్కూటీ పంక్చరైందని ఆరిఫ్‌ చెప్పాడు.
► 9.15కు శివకు బండి ఇచ్చి పంక్చర్‌ వేయించుకుని రమ్మని పంపాడు.
► 9.19కి ప్రియాంక తన సోదరికి ఫోన్‌ చేసి మాట్లాడింది.
► 9.30కి శివ పంక్చర్‌ వేయించకుండా.. గాలి నింపుకుని వచ్చాడు.. షాపు లేదని అబద్ధం చెప్పాడు.
► 9.35కి శివను మరో దుకాణానికి వెళ్లాలని ఆరిఫ్‌ పంపించాడు.
► 9.40కి ప్రియాంకను నిర్మానుష్య ప్రాంతానికి దుండగులు లాక్కెళ్లారు.
► 9.48కి ప్రియాంక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ఈలోగా శివ కూడా అక్కడికి వచ్చాడు. ముగ్గురి తర్వాత శివ కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు.
► 10.08కి ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది.
► 10.13 గంటలకు శవాన్ని లారీలో వేసుకుని షాద్‌నగర్‌ వైపు బయల్దేరారు.
► రాత్రి ఒంటిగంట సమయంలో నందిగామ వద్ద పెట్రోల్‌ కోసం ప్రయత్నించారు.
► 2 నుంచి 2.30 గంటల మధ్య చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహం దహనం చేశారు.
► తెల్లవారుజామున 3 గంటలకు నిందితులు ఆరాంఘర్‌కు చేరుకున్నారు.

చదవండి:
ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !

నమ్మించి చంపేశారు!

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు

'పోలీసులు చేసిన పని సరైనదే'

‘కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతోంది’

సమత కేసు : లాయర్‌ను నియమించిన కోర్టు

నాపై కక్ష సాధిస్తున్నారు: సంపత్‌ కుమార్‌

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌

సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు

వెల్‌కమ్‌ సర్‌

బంపర్‌ ఆఫర్లతో స్వాగతం.. బండి కొనండి

యూ ట్యూబ్‌ చూసి.. నేరాలకు దిగి

పదేళ్ల తర్వాత మళ్లీ.. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు

ఎవరైనా.. ఎక్కడి నుంచైనా!

40 సేఫ్టీ

రైతులను నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్‌ చేస్తా

ప్రవిజ.. ఇక్కడే సూసైడ్‌ చేసుకుందాం: సురేష్‌

కలెక్టర్‌ సర్ఫరాజ్‌పై వేటు

సేవలోనే అందం ఆనందం..

సమత నిందితుల తరఫున వాదించేందుకు నిరాకరణ

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

కక్షతోనే సురేష్, ప్రవిజ దంపతుల ఆరోపణలు..

నేడు యాదాద్రికి సీఎం రాక

నేటి ముఖ్యాంశాలు..

బాలికపై యువకుడి అత్యాచారం

చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట

ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు!

మద్యం ధరలకు కిక్కు!

రాష్ట్రపతి శీతాకాల విడిదికి యాక్షన్‌ప్లాన్‌

19న ర్యాలీ: లెఫ్ట్‌ పార్టీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈసారీ ఆస్కారం లేదు!

ఈ విజయానికి కారణం మా యూనిట్‌ – వెంకటేశ్‌

కొత్త దశాబ్దానికి శుభారంభం

చెత్త రాజకీయాలు ఆపండి

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కోరిక నెరవేర్చిన నాగార్జున

ఫిబ్రవరి నాటికి మరో ‘కాజల్‌’