నగదు చెల్లింపునకు ఇక ఒక్క లేనే

15 Jan, 2020 03:59 IST|Sakshi

జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద ఇక తిప్పలే

కేంద్రం అనుమతిస్తే మాత్రం యథాప్రకారం

హైబ్రిడ్‌ విధానం కొనసాగింపు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద బుధవారం నుంచి నగదు చెల్లించే వాహనాలకు ఒక్కోవైపు  మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న హైబ్రిడ్‌ విధానాన్ని కొనసాగించే విషయంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్పష్టమైన హామీ ఇవ్వనందున బుధవారం నుంచి దాన్ని తొలగిస్తున్నట్టు ఎన్‌ హెచ్‌ఏఐ రాష్ట్ర ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌ తెలిపారు. హైబ్రిడ్‌ విధానంలో 25% లేన్లు నగదు చెల్లించే వాహనాలకు కేటాయించగా, ఫాస్టాగ్‌ వాహనాలకు మిగతావి అందుబాటులో ఉన్నాయి.

ఫలితంగా సంక్రాంతి రద్దీ ఉన్నా, ఎక్కువగా ఇబ్బంది లేకుండా వాహనాలు ముం దుకు సాగాయి. పంతంగి లాంటి రద్దీ ఎక్కువగా ఉండే టోల్‌ప్లాజాల వద్ద అర కిలోమీటరు మేర వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. ప్రస్తుత హైబ్రిడ్‌ విధానం గడువు మంగళవారంతో తీరిపోయింది. బుధవారం నుంచి కేంద్రం ముందు చెప్పినట్టుగా టోల్‌ గేట్‌ల వద్ద ఒక్కోవైపు ఒక్కోవైపు  మాత్రమే నగదు చెల్లింపు వాహనాల కోసం కేటాయించనున్నారు.  

తిరుగు ప్రయాణంలో ఇబ్బందే
సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు నగరం నుంచి భారీ సంఖ్యలో జనం ఊరిబాట పట్టారు. దాదాపు 35 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. పండుగ తర్వాత వీరు మళ్లీ తిరుగు ప్రయాణం కానున్నారు. వెళ్లేప్పుడు హైబ్రీడ్‌ విధానం వల్ల టోల్‌గేట్ల వద్ద పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడు ఒక్కలే¯Œ  మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయిస్తున్నందున, తిరుగు ప్రయాణంలో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో టోల్‌గేట్ల వద్ద నమోదైన లెక్కల ప్రకారం.. 55% వాహనాలకు ఫాస్టాగ్‌ ఉంది. 45% వాహనాలకు టోల్‌ను నగదు రూపంలో చెల్లించారు. ఇప్పుడు ఈ 45% వాహనాల తిరుగు ప్రయాణంలో ఆ ‘ఒక్కోవైపు ’నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతో కిలోమీటర్‌ కంటే ఎక్కువ దూరం క్యూలు ఏర్పడే పరిస్థితి ఉంది.

అయితే ఎక్కువ మంది పండుగకు రెండ్రోజుల ముందు వెళ్లగా, వచ్చేటప్పుడు నాలుగైదు రోజుల్లో ప్రయాణించే అవకాశం ఉంది. అంటే వెళ్లేప్పుడు ఉన్న రద్దీ ఉండదు. అయినా, ఒక్క లేన్‌ నుంచి అన్ని వేల వాహనాలు వెళ్లాల్సి రావటం కొంత ఇబ్బందేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు తీవ్రంగా ఉంటే, అప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతి పొంది లేన్ల సంఖ్యను పెంచే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఒకవేళ హైబ్రిడ్‌ విధానం గడువు పెంచితే, బుధ వారం ఉదయం తమకు సమాచా రం వస్తుందని, అప్పుడు ఇబ్బంది ఉండే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా