ఈవీఎంలో అభ్యర్థుల కూర్పు ఇలా..

13 Nov, 2018 14:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నామినేషన్‌ పత్రాల ఆధారంగానే కేటాయింపు 

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు

సాక్షి, షాద్‌నగర్‌ టౌన్‌: ఎన్నికలు అంటేనే అదో కోలాహలం.. నేతలు గల్లీగల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుంటారు. జన బలం ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థి ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ఓటర్లను ఆకర్షించడం.. ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. ఫలానా గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం, ఈవీఎంలో తమ పేరు, గుర్తు ఏ వరుసలో ఉంటుందో జనానికి చెప్పి ఓటు వేయించుకోవడం మరో ఎత్తని చెప్పవచ్చు. అయితే, ఈవీఎంలో తన పేరు, గుర్తు ఎక్కడున్నదో ఓటర్లకు తెలిపేందుకు నానా తంటాలు పడుతుంటారు. అధికారులు మాత్రం బ్యాలెట్‌ కూర్పులో ఏమాత్రం పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల కమిషన్‌ సూచించిన నియమావళి, మార్గదర్శకాలను అనుసరించి ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత పొందుపరుస్తారు. ఆ తతంగం ఇలా ఉంటుంది. అభ్యర్థులు ముందుగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఎంచుకుంటారు.  

ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి..  
నామినేషన్‌ పత్రాల్లో తమ పేరు, ఇంటి పేరు నమోదు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో విధానం ఉంటుంది. అందుకే నామినేషన్‌లతో పాటుగా బ్యాలెట్‌లో అభ్యర్థి పేరు ఎలా ఉండాలని కోరుకుంటారో ప్రత్యేకంగా రాసి ఇవ్వాలని అధికారులు సూచిస్తారు. ఇదే బ్యాలెట్‌లో సదరు అభ్యర్థికి చోటు కేటాయించేందుకు ఎన్నికల అధికారులకు ఆధారం. అభ్యర్థుల ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించేందుకు మొదట జాతీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తారు. వారిచ్చిన పేరులో మొదటి అక్షరాలను పరిశీలించి తెలుగు వర్ణమాల (పెద్ద బాలశిక్ష)లోని అక్షరాలు, గుణింతాల ఆధారంగా వరుస క్రమాన్ని నిర్ధారిస్తారు. జాతీయ పార్టీల అభ్యర్థులను గుర్తించి వారికి వరుస నంబరు కేటాయించిన అనంతరం గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల వివరాలను పొందుపరుస్తారు. ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్ర పార్టీల అభ్యర్థులు ఉంటే వారిచ్చిన పేరు వివరాల ఆధారంగా తెలుగు వర్ణమాలను అనుసరించి వరుసలో కేటాయిస్తారు.  

మరిన్ని వార్తలు