ప్రొఫెషనల్స్ టు సివిల్స్

6 Feb, 2015 01:10 IST|Sakshi
ప్రొఫెషనల్స్ టు సివిల్స్

కష్టతరమైన లక్ష్యాలు సాధించాలి
తద్వారా ఇతరుకు మేలు చేయాలి
ఐఏఎస్‌గా సవకు అవకాశాలు ఎక్కువ
జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐఏఎస్‌ల మనోగతం

 
వాళ్లంతా నవ యువత.. బీటెక్ కొందరు... ఎంటెక్ మరికొందరు... ఎంబీబీఎస్ ఇంకొందరు పూర్తి చేశారు. వారిలో చాలామంది నెలకు  ఆరంకెల జీతం సంపాదిస్తున్న వారూ ఉన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చునే సాఫ్ట్‌వేర్ రంగంకన్నా తాము కష్టపడుతూ ఇతరులకు చేసేసేవ దేశ భవిష్యత్‌కు పునాది వేస్తుం దని తలంచారు. అందుకే కఠోర శ్రమతో సివి ల్స్ రాసి మంచి ర్యాంకులతో ఎంపికయ్యారు. వారి శిక్షణ కాలం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత అంతా ఐఏఎస్ హోదాతో విధుల్లో చేరుతారు. శిక్షణ చివరి అంకంలో భాగంగా భా రత్ దర్శన్ యాత్ర చేపట్టారు. అందులో భాగం గా గురువారం జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ కరుణ, జేసీ ప్రశాత్ పాటిల్‌తో సమావేశమయ్యారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘హరిత కాకతీయ’ హోటల్‌లో విడిది చేసిన వారు తమ లక్ష్యాలు.. ఆశయాలు.. కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పాల నా వ్యవస్థ తీరు తదితర అశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లో..
 - హన్మకొండ అర్బన్
 
 ట్రైనీ ఐఏఎస్‌లకు స్వాగతం


 మట్టెవాడ : ముస్సోరి నుంచి గురువారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు వచ్చిన 18 మంది ట్రెరుునీ ఐఏఎస్‌లకు వరంగల్ తహసీల్దార్ ఎన్.రవి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు స్టడీ టూర్‌లో భాగంగా వారు వరంగల్‌లో ఉంటారని తహసీల్దార్ వివరించారు. 18 మంది ఐఏఎస్‌లు ఒకేసారి వరంగల్‌కు రావడంంతో స్టేషన్ కళకళలాడింది.
 
డాక్టర్‌గానే ఉండి పొమ్మన్నారు

 మాది కేరళ రాష్ట్రం ఐఏ ఎస్‌కు సెలక్ట్ కాక ముందు ఎంబీబీఎస్ పూర్తి చేశా. రెండేళ్లు ప్రాక్టీస్ కూడా చేశాను. నాన్న శ్రీహరికోటలో ఐబీఆర్‌ఓగా పనిచేశారు. ఇంట్లో మాత్రం డాక్టర్‌గా కంటిన్యూ కమ్మన్నారు. వాళ్లను కన్విన్స్ చేసి ఇటువైపు వచ్చాను. చిన్ననాటి నుంచి ఐఏఎస్ కావాలన్నది నాకలగా ఉండేది. నాకు చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్ చాలా ఇష్టం. స్కూల్ స్థాయిలో పాల్గొన్న ప్రతి పోటీలో బహుమతులు గెలిచేదానిని. ఆ తర్వాత ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ఇప్పించేవారు. అలాంటి ప్రముఖుల్లో ఎక్కువగా ఐఏఎస్ అధికారులే ఉండేవారు. అలా.. నేను కూడా ఓ ప్రముఖ స్థానంలో ఉండాలని. అందరికీ సేవ చేయాలని అనిపించేది. అందుకే ఎంబీబీఎస్ చదివినా ఐఏఎస్ లక్ష్యం మాత్రం మర్చిపోలేదు. యువత ఎవరైనా తమ ల క్ష్యాన్ని మరువొద్దు.
 - దివ్య అయ్యర్, కేరళ
 
భారత్ దర్శన్ ఏన్నో నేర్పుతుంది

క్లాస్ రూంలో ఉండి చదివే వాటికన్నా క్షేత్రస్థాయి పర్యటనలు చక్కని పాఠాలు నేర్పుతాయి. ప్రస్తుతం మాకు శిక్షణ కాలంలో భారత్ దర్శన్ యాత్ర చక్కటి అనుభూతిగా మిగులుతుంది. ఈ టూర్‌లో ఎన్నో నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా మన దేశంలో అవినీతి... బాధ్యతారాహిత్యం అన్నవి అతిపెద్ద సమస్యలు.. సవాళ్లుగా ఉన్నాయి. వాటిని ఏ ఒక్కరూ పూర్తిగా రూపుమాపలేరు. ఎవరికి వారు తమవంతుగా కృషి చేయాలి. ఈ అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్ స్థాయి వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకే అండమాన్, నికోబార్ వంటి ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో కొంతకాలం పనిచేశాక ఈ రూట్ ఎంచుకున్నా. ఏడేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయారు. అన్నయ్య మా బాధ్యతలు తీసకుని దిశానిర్ధేశం చేశారు. అన్ని పరిస్థితులు చూసి లక్ష్యం సాధించాలని ముందుకు సాగా.
   - లోకేష్, బీటెక్ కంప్యూటర్స్, మధ్యప్రదేశ్ క్యాడర్
 
దేశం గొప్పగా ఉంది..పేదల పరిస్థితి దారుణంగా ఉంది

మన దేశానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇతర దేశా ల్లో మనవాళ్లే ఎక్కు రంగా ల్లో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతా ల్లో.. మారుమూల పల్లెల్లో పరిస్థితులు, ప్రజల జీవన స్థితిమరీ దారుణంగా ఉంది. ఇంత తేడా ఉండటానికి బలమైన కారణం వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతోంది. ఆ లోపం సరిచేయగలిగితే అభివృద్ధి అందరికీ సమానంగా అందుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్‌ల చేతిలో చాలా వరకు ఉంటుం ది. నేను ఎంటెక్ ఖరగ్‌పూర్ ఐఐటీలో చదివా. నాన్న రైల్వేస్‌లో పని చేసేవారు. మాది రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్నగ్రామం. అందుకే పేదలు, పేదరికం గురించి బాగా తెలుసు. మనం ఎంచుకున్న లక్ష్యం ముందు ఎలాంటి సమస్యలైనా చిన్నవే. లక్ష్యాన్ని సాధిస్తే మిగ తా సమస్యలన్నీ  వాటంతటవే దూరమవుతాయి.
 - కులదీప్‌చౌదరి, రాజస్థాన్(జార్ఖండ్ క్యాడర్)
 
గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటే..

సమస్యలు ఎత్తి చూపడం కన్నా... ఒక మంచి పరిపాలన అధికారిగా ఉంటే మన మే వాటిని సరిదిద్దే అవకాశం ఎక్కువగా ఉంటుం ది. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో యూత్ ఎవరికివారు. సేఫ్ సైడ్ చూసుకుని వెళితే చివరికి మిగిలేది ఎవరు.. ఐఏఎస్ కన్నా ఎక్కువ సంపాదించాలంటే చాలా మార్గాలు.. రంగాలున్నాయి. కష్టపడకుండా కూడా సంపాదించే అవకాశాలు కాకుండా మనం కష్టపడుతూ సంపాదించే దాంట్లో సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా దేశ స్థితిని మార్చేందుకు తోడ్పడే మార్గాలు ఎన్నుకోవాలి. మన యూత్ ఏంటో ఇతర దేశాల వాళ్లకి కూడా తెలుసు. అలాంటిది మన దేశ దిశ మార్చాలంటే అంకిత భావంతో పనిచేసే పాలనా యంత్రాంగం అవసరం యువత అవినీతరహితంగా పని చేసేందుకు ముందుకు రావాలి. అప్పుడే ఆశించిన మార్పును కాస్త ఆల్యంగా అయినా చూడగలం.
 - అమిత్ కుమార్‌పాండే, యూపీ(రాజస్థాన్ క్యాడర్)
 
ప్రభుత్వ పాలసీలు మారాల్సి ఉంది

డాక్టర్‌గా పని చేస్తే సామాజిక సేవ ఎంత చేయాలని ఉన్నా పరిమితులుంటాయి. ముఖ్యంగా హౌస్‌సర్జన్ చేసే సమయంలో చాలామంది పేషెంట్ల పరిస్థితి చూస్తే బాధగా అనిపించేది. డాక్టర్‌కు ఇచ్చే ఫీజు ఉండదు.. మందులు కొనే స్థోమత ఉండదు. ఒక డాక్టర్‌గా నేను వారికి ఉచితంగా వైద్యం, మందులు మాత్రమే అందించగలను.  కానీ అదే ఒక ఐఏఎస్ అధికారిగా అయితే అంకిత భావంతో పనిచేసేవారికి చాలా అవకాశాలుం టాయి. ప్రభుత్వాలు పేదల కోసం చాలా రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అయితే వాటిని అమలు చేసే విధానాల్లో మార్పు రావాల్సి ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పేదలకు కేటాయించిన పథకాలు, నిధులు వారిని పూర్తిగా చేరడంలేదు. పరిపాలనాపరమైన లోపాలను సరి చేస్తే.. ఆశిం చిన లక్ష్యాలు నెరవేరుతాయి.మా నాన్న బీఎస్‌ఎన్‌ఎల్ త్రివేడ్రంలో ఉద్యోగి. అమ్మ హౌస్‌వైఫ్.
 - డాక్టర్ విలియం, కేరళ త్రివేడ్రం(గుజరాత్ క్యాడర్)
 
ఐపీఎస్ శిక్షణ నుంచి వచ్చా

మా ఇంట్లో నాన్న ప్రొఫెసర్. అమ్మ టీచర్. చదువు విషయంలో పూర్తి ప్రోత్సాహం ఉండేది. అందుకే ఆడపిల్లనైనా.. ముందు ఐపీఎస్‌కు ప్రిపేర్ అయి ఎంపికయ్యా. కేరళ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికై కేరళలో 8 నెలలు శిక్షణ పొందా. ఇదే సమయంలో ఒకసారి ఐఏఎస్ కోసం ఇంకాస్త కష్టపడాలని నిర్ణయానికి వచ్చి ప్రయత్నించా. నా శ్రమ వృథా కాలే దు. అందుకే ఉన్నదాంతో తృప్తి పడకుండా యువత ఆశించింది సాధించే వరకు పట్టుదలతో కృషియాలి. ముఖ్యంగా సమాజానికి అందించాల్సింది  విద్యా, ఆరోగ్యం ఈ రెండూ నాణ్యమైనవి అందిస్తే మిగతావాటిని ఆవే సృష్టిస్తాయి. దేశంలో పేదలకు ఆహార భద్రత అతిముఖ్యమైంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కొన్ని మెరుగైన పాలసీలు తీసుకొస్తే పేదలకు మేలు జరుగుతుంది. ప్రసుత్తం మాకు భారత్ దర్శన్ ఒక మంచి అనుభూతిగా మిగులుతుంది.               
           - శుభం చౌదరి, ఢిల్లీ(రాజస్థాన్ క్యాడర్),
                                              ఎంఏ(ఎకనామిక్స్)
 
భారత్ దర్శన్‌తో దేశ పరిస్థితులు తెలుస్తాయి

మాది కేరళ రాష్ట్రం. నేను కేరళ క్యాడర్ ఐఏఎస్‌గా ఎంపిక కావడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నాన్న ఆరోగ్యశాఖలో అధికారి. అమ్మ టీచర్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతం మా స్టడీ లో భారత్ దర్శన్ పేరుతో ప్రస్తుతం చేస్తున్న యాత్ర కేరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమస్యలు తెలిస్తే వాటికి పరిష్కారాలు చూడొచ్చు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం కొంత సమ్యగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేడపతున్న కార్యక్రమాల వల్ల నక్సలిజం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ దిశగా మరింత ప్రయత్నాలు జరగాలి. అందులో భాగంగా ప్రజల సమస్యపరిష్కరించేందకు మంచి వేదిక ఐఏఎస్ హోదా. అందుకే ఉన్నత లక్ష్యాలతో ప్రయత్నించి ఈ రూట్‌కు వచ్చా. అంకిత భావంతో పనిచేస్తా.      
 - చిత్ర, కేరళ(కేరళ క్యాడర్)
 
 ఫిబ్రవరి 20 నాటికి శిక్షణ పూర్తి


ఎంతో ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో ఈ రూట్ ఎంచుని కష్టపడి ముందుకు వెళుతున్నాం. మా శిక్షణ ఫిబ్రవరి 20తో పూర్తవుతుంది. ఆ సమయం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఐఏఎస్ అధికారికి పరిపాలనాపరంగా సేవకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా ఉద్యోగాల్లో ఆదాయం ఉన్నా.. సమాజానికి పెద్దగా చేసేది ఉండదు. అందుకోసమే ఈ రూట్‌ను ఎంపిక చేసుకుని వచ్చా. బీటెక్ కంప్యూటర్స్ చదివా. ఉద్యోగ వేటలో కాకుండా సివిల్స్ ప్రిపేర్ అయ్యా. అనుకున్నట్లు సెల క్ట్ య్యా. ఇక చేయాల్సిందంతా ముందుంది. యువత తమకున్న లక్ష్యాలు సాధించేందుకు ఎంత కష్టాన్నయినా భరించి ముందుకు సాగాలి. అప్పుడే విక్టరీ విలువ తెలుస్తుంది.
 యశ్‌పాల్ మీనా, రాజస్థాన్
 (బీమార్ క్యాడర్)
 
 
 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌

‘ఎర్రమంజిల్‌’ వారసత్వ భవనం కాదు..

స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్‌ తలాక్‌?!

హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు

హంగులకే కోట్లు ఇస్తున్నారు

‘పాకిస్తాన్‌ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’

ఇంటికి చేరిన ‘టింగు’

మరింత ప్రియం కానున్న మద్యం

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కేటీఆర్‌ స్ఫూర్తితో..

ఉస్మానియాను ‘ఆన్‌లైన్‌’ చేశా

కమలాకర్‌ వర్సెస్‌ కమలాసన్‌

రాబందును చూపిస్తే లక్ష నజరానా

రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి

ఇండియాకు వస్తాననుకోలేదు 

వదల బొమ్మాళీ!

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తే జైలుకే!

‘వసూల్‌ రాజా’పై సీపీ సీరియస్‌

లబ్ధిదారులతో స్పీకర్‌ వీడియో కాల్‌ 

పోతరాజుల పోసాని

కామారెడ్డిలో పట్టపగలే భారీ చోరీ

క్షణాల్లో గుట్కా మాయం

వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య

‘బిల్ట్‌’ భూముల అమ్మకంపై ఆగ్రహం

కోల్డ్‌ స్టోరేజ్‌లో  అగ్ని ప్రమాదం

మందు బాబులకు వాట్సాప్‌ సాయం!

కట్నం కోసమే హైమావతిని హత్య చేశారు

మ‘రుణ’ శాసనం

ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!