మహిళలపై నేరాలకు మద్యమే కారణం

8 Dec, 2019 05:38 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

పంజగుట్ట: మహిళలపై జరుగుతున్న నేరాలకు మద్యమే కారణమని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. మద్యం కారణంగా రాష్ట్రానికి ఏటా రూ.11 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ప్రభుత్వాలు దీనిని ఒక ఆర్థిక వనరుగానే చూస్తున్నాయి కానీ.. దానివల్ల కలిగే నష్టం గురించి ఆలోచించడం లేదన్నారు. ‘మహిళలపై హింస ఎవరిదెంత పాత్ర–మన కర్తవ్యం’అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

కమిటీ ఆఫ్‌ కన్సర్స్‌ సిటిజన్స్, ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్, వీ అండ్‌ షీ, వందేమాతరం ఫౌండేషన్, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్, గ్రామ వికాస్‌ భారత్, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్, వికాస్‌ యూత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘సాక్షి’దినపత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతోన్న దారుణాలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వక్తలు మాట్లాడిన అంశాలపై ప్రణాళిక రూపొందించి.. ఆచరణలోకి తెచ్చేందుకు కృషిచేద్దామని సూచించారు.

మరిన్ని వార్తలు