పల్లెలు ప్రశాంతం..!

13 Nov, 2018 11:51 IST|Sakshi

ఎన్నికల పుణ్యం..బెల్ట్‌ షాపులమూత

పొద్దుగూకగానే గూటికి చేరుతున్న మద్యం ప్రియులు

హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు  

సాక్షి,మిర్యాలగూడ రూరల్‌ : శాసన సభ ఎన్నికల పుణ్యమా అని పచ్చని పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదేంటి అనుకుంటున్నారా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీస్, ఎక్సైజ్‌ శాఖ కఠినంగా వ్యవహరిస్తుండడంతో మండలంలోని గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే మద్యం బెల్ట్‌ షాపులు మూతపడ్డాయి. దీంతో విచ్చల విడిగా మద్యం లభించకపోవడంతో మం దుబాబులు పొద్దుగూకగానే గూటికి చేరుకుంటున్నారు. దీనివల్ల గ్రామాల్లో ప్రశాతంత నెలకొంది. 
గ్రామాలకి 3–5 బెల్ట్‌ షాపులు 
ఎన్నికల ప్రకటన రాక మునుపు ప్రతి మారు మూల పల్లెల్లో సహితం 3నుంచి 5 బెల్ట్‌ షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్‌ షాపులో ఎప్పుడు మద్యం అయిపోయినా వైన్‌ షాపు నిర్వాహకులు వెంటనే సరఫరా చేసే వారు. దీంతో మద్యం ప్రియులకు ఎప్పుడుపడితే అప్పుడు మందు అందుబాటులో ఉండేది. 
నిషేధంతో మహిళలు హర్షం 
ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఎప్పుడైతే పోలీసులు బెల్ట్‌షాపులపై ఖచ్చితత్వం పాటించారో.. గ్రామాల్లో అక్రమంగా నిర్వహించే బెల్ట్‌ షాపులు మూత పడ్డాయి. మందు ప్రియులకు విచ్చలవిడిగా మద్యం లభించకపోవడంతో తమ పతులు త్వరగా ఇళ్లకు చేరుతున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిషేధం కొనసాగించాలి:
బెల్టుషాపుల నిషేధం కొనసాగించాలి. వీటి వల్ల గ్రామాల్లో విచ్చల విడిగా మధ్యం లభించడంతో అదుపులేకుండా మద్యం సేవించి రోగ్యం, ఇటు ఆర్థికంగా గుల్ల అయ్యేవారు. బెల్టుషాపుల నిషేధంతో   మద్యం అందుబాటులో లేక పోవడంతో మందు ప్రియులు మితిమీరిన చేష్టలు కట్టడి అయ్యాయి. పల్లెలు ప్రశాతంగా మారాయి.–చలెండ్ల పద్మయ్య, అవంతీపురం  

మరిన్ని వార్తలు