టెక్నాలజీకి నాంది.. రాజీవ్ గాంధీ : మాజీమంత్రి సీఆర్‌ఆర్

22 May, 2016 02:53 IST|Sakshi
టెక్నాలజీకి నాంది.. రాజీవ్ గాంధీ : మాజీమంత్రి సీఆర్‌ఆర్

ఎదులాపురం : దేశంలో టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందడానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 26వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఆర్‌ఆర్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఖ్యాతి రాజీవ్ గాంధీకి దక్కుతుందని పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ భారత జాతిని ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేయడానికి తాపత్రయపడితే నేటి ప్రభుత్వాలు మతతత్వానికి పెద్ద పీట వేస్తూ ప్రజా సంక్షేమాన్ని మరిచాయని విమర్శించారు. రాజీవ్ గాంధీ హయంలో నెహ్రూ రోజ్‌గార్ పథకం ద్వారా గ్రామాల రూపు రేఖలను మార్చారని, నేడు కేవలం మాటల గారడితో పబ్బం గడుపుకునే ప్రభుత్వాలున్నాయని పేర్కొన్నారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శనీయమైనదని ప్రతీ ఒక్కరూ రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు యాసం నర్సింగ్ రావ్, సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కే. ప్రవీణ్ కుమార్, సుకేందర్, అంబకంటి అశోక్, సాజిద్ ఖాన్, దిగంబర్ రావ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు