వాగ్దానాలు అమలు చేయాలి

4 Feb, 2015 04:03 IST|Sakshi
వాగ్దానాలు అమలు చేయాలి

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి
 రఘునాధపాలెం: ఎన్నికల ముందు పలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కిందని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  దివంగత సీఎం వైఎస్‌ఆర్ అర్హులైన పేదలందరికీ నెలకు రూ. 200 పింఛన్ ఇస్తే.. నేటి పాలకులు అనేక కుంటిసాకులు చెపుతూ అర్హులైన పలువురి పెన్షన్లు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా పేదలు ఈ విషయం పైనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతు రుణమాఫీలోనూ పేదలను మోసం చేశారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు మృత్యువాత పడుతున్నారని, సోమవారం ఖమ్మం మార్కెట్‌లో జరిగిన ఘటన చూస్తే ప్రభుత్వం అన్నదాతల పట్ల ఎలాంటి వైఖరి అవలంభింస్తో తెలుస్తుందన్నారు. దళితులకు మూడెకరాల భూమి కూడా హామీలకే పరిమితమైందని విమర్శించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు వెంటనే నేరవేర్చాలని  డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు