సీఈవోలు, డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు 

8 Mar, 2019 01:08 IST|Sakshi

ఫలించిన ఎంపీడీవోల 25 ఏళ్ల నిరీక్షణ

95 మందికి బదిలీలు, పోస్టింగ్‌లిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ శాఖలో పాతికేళ్లకుపైగా ఎంపీడీవోలుగా పనిచేస్తూ పదోన్నతులు, పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలించింది. మూడు నెలల క్రితం వంద మందికిపైగా ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించినా ఎన్నికల కోడ్‌ కారణంగా వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఈ పదోన్నతుల ద్వారా జిల్లాల్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి తదితర విభాగాల్లో పీఆర్‌ శాఖకు సంబంధించిన అధికారులే వివిధ విధులు నిర్వహించనున్నారు.‡రెండున్నర దశాబ్దాలకుపైగా ఎదురుచూపుల తర్వాత 95 మందికి డిప్యూటీ సీఈవో, డీఆర్‌డీఏ, గ్రామీణాభివృద్ధి, అకౌంట్స్‌ ఆఫీసర్లు తదితర పోస్టుల్లో బదిలీ, పోస్టింగ్, డిప్యూటేషన్లపై నియమిస్తూ గురువారం పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు 

సీఈవో, డిప్యూటీ సీఈవో, ఇతర పదవులకు... 
ఆదిలాబాద్‌ మండల ప్రజాపరిషత్‌(ఎంపీపీ)లో పనిచేస్తున్న జి.జితేందర్‌రెడ్డిని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ సీఈవోగా; మంచిర్యాల ఎంపీపీలో పనిచేస్తున్న కె.నరేందర్‌ను ఆదిలాబాద్‌ జడ్పీ సీఈవోగా బదిలీ చేశారు. పీజే వెస్లీని డిప్యూటేషన్‌పై టీఎస్‌ఐఆర్‌డీలోని ఈటీసీ ప్రిన్సిపాల్‌గా; కె.అనిల్‌కుమార్‌ను టీఎస్‌ఐఆర్‌డీ ఏవోగా, ఎం.ఉమారాణిని స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా; కె.సునీతను ఎస్‌ఈసీ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమించారు. ఎస్‌.దిలీప్‌కుమార్‌ను డైరెక్టర్‌ ఎస్‌బీఎంగా డిప్యూటేషన్‌పై పంపించారు. డిప్యూటీ సీఈవోలుగా నియమితులైన వారిలో ఎం.లక్ష్మీబాయి (మెదక్‌–పోస్టింగ్‌), ఎం.పద్మజ(మహబూబ్‌నగర్‌–పో), సి.శ్రీకాంత్‌రెడ్డి (రంగారెడ్డి –పో), డి.పురుషోత్తం (ఖమ్మం–పో), ఎల్‌.విజయలక్ష్మీ (నల్లగొండ–పో), బి. గౌతంరెడ్డి (కరీంనగర్‌–పో), గోవింద్‌(నిజామాబాద్‌–పో), ఎ.రాజారావు (వరంగల్‌–పో), సన్యాసయ్య(ఆదిలాబాద్‌–పో) ఉన్నారు. డిప్యూటేషన్‌పై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులుగా నియమితులైనవారిలో మర్రి వెంకట శైలేష్‌ (ఆసిఫాబాద్‌), జె.సుమతి (భూపాలపల్లి).సీహెచ్‌ శ్రీనివాసరావు(సంగారెడ్డి), పి.బలరామారావు(మహబూబాబాద్‌) ఉన్నారు. ఈ.అనిల్‌కుమార్‌ను టీఎస్‌ఐఆర్‌డీ జాయింట్‌ డైరెక్టర్‌గా; ఎం.నవీన్‌కుమార్, టి.శ్రీనాథ్‌రావులు సెర్ప్‌ డైరెక్టర్లుగా; జి.వెంకటసూర్యారావు, ఎస్‌.వెంకటేశ్వర్, బి.రాఘవేందర్‌రావు, ఎన్‌.శోభారాణిలు ఈటీసీ ఫ్యాకల్టీలుగా నియమితులయ్యారు. 

సీఎం, మంత్రికి కృతజ్ఞతలు... 
ఇరవై ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడంతోపాటు పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖలోనే పోస్టింగ్‌లు ఇచ్చిన సీఎం కేసీఆర్, పీఆర్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీఆర్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌లకు తెలంగాణ ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బి.రాఘవేందర్‌రావు, ప్రధానకార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వడంతో తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా