జూనియర్‌ లెక్చరర్లుగా టీచర్లకు పదోన్నతులు!

26 Jul, 2017 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హతలు కలి గిన స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చ రర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభు త్వం కసరత్తు ప్రారంభించింది.  ఇప్పటికే పంచాయతీరాజ్‌ టీచర్‌ పోస్టులను లోకల్‌ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆర్గనైజ్‌ చేయిం చిన ప్రభుత్వం.. పంచాయతీరాజ్, ప్రభుత్వ టీచర్లకు ఒకే రకమైన (ఏకీకృత) సర్వీసు రూల్స్‌ రూపక ల్పనలో పడింది.

మరోవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్న తులు కల్పించేందుకు సిద్ధం అవుతోంది.  స్కూల్‌ అసిస్టెంట్లకే జూని యర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించే ఉత్తర్వులను రద్దు చేస్తూ 2008 సెప్టెంబర్‌ 18న ప్రభుత్వం జారీ చేసిన జీవో 223ని ఉపసంహరించే దిశగా ఆలోచనలు చేస్తోంది.

నేడు ఉన్నతస్థాయి సమావేశం
ఈనెల 26న పాఠశాల, ఇంటర్మీడియెట్‌ విద్యా కమిషనర్లు, ఇతర అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  జీవో 223ని సవరించాలా లేక ఉపసంహరించాలా? ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏం చేయాలన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  ఇంటర్మీడియెట్‌ విద్యలో ఉద్యోగాల భర్తీకి అనుసరించాల్సి నిబంధనలపై కూడా చర్చిస్తారు.

మరిన్ని వార్తలు