టీఎస్‌ఎస్‌పీలో ప్రమోషన్ల గలాట

11 Aug, 2019 01:35 IST|Sakshi

అనర్హులకు పదోన్నతులు కట్టబెట్టే యత్నం

జనరల్‌ గ్రూపు వాళ్లను కాదని మిగిలిన విభాగాలకు ప్రమోషన్లు

ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ అధికారి

న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ)లో ఇప్పుడు పదోన్నతల గలాటా రేగుతోంది. ప్రమోషన్ల విషయంలో జనరల్‌ విభాగానికి మిగిలిన విభాగాలకు మధ్య దూరం చెరిపేస్తూ అమలు చేయాలని చూస్తోన్న కొత్త విధానం ఉద్యోగుల మధ్య చిచ్చుపెడుతోంది. దీంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగిపోయింది. తమకు రావాల్సిన ప్రమోషన్లను ఇతరులు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధమని జనరల్‌ విభాగాల ఉద్యోగులు అంటుంటే.. తాము కూడా న్యాయపోరాటానికి వెనుకాడమని ఇతర విభాగాల సిబ్బంది అంటున్నారు. దీంతో ఈ వివాదం రోజురోజుకు ముదిరేలా కనిపిస్తోంది. 

అసలేంటి వివాదం.. 
ఉమ్మడి రాష్ట్రంలో ఈ విభాగం (అప్పట్లో ఏపీఎస్పీగా వ్యవహరించేవారు) ఒక వెలుగు వెలిగింది. టీఎస్‌ఎస్‌పీలో మొత్తం 13 బెటాలియన్లు ఉండగా దాదాపుగా 13వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. టీఎస్‌ఎస్‌పీలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్‌ విభాగం వీరిని గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ, ఆక్టోపస్, స్పెషల్‌ ఆపరేషన్స్, కూంబింగ్‌ ఒకటేమిటి.. దాదాపుగా క్లిష్టమైన అన్ని ఆపరేషన్లకు ఉపయోగించేవారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గాక వీరి పేరు వినిపించడం కాస్త తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆక్టోపస్, ఎస్‌ఐబీ, కూంబింగ్‌కు వీరినే వినియోగిస్తున్నారు. వీరు నిత్యం ప్రాణాలకు తెగించి, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టులపై పోరులో చనిపోయిన పోలీసుల్లో సింహభాగం వీరే కావడం గమనార్హం. వీరి తరువాత మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్, బ్యాండ్, ఆర్మర్‌ అనే మూడు విభాగాలు ఉంటాయి. వీరికి రిస్క్‌ తక్కువ. కాబట్టి డిపార్ట్‌మెంట్‌ పదోన్నతుల విషయంలో వీరికన్నా జూనియర్లయినప్పటికీ.. జనరల్‌ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అధికారులు కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. 

చక్రం తిప్పుతున్న అధికారులు.. 
కానీ, ఇపుడు అన్ని విభాగాలు ఒకటేనని అందరికీ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలన్న అంశాన్ని ఓ ఉన్నతాధికారి తెరపైకి తీసుకువచ్చారు. దీంతో తేనెతుట్టెను కదిపినట్లయింది. విధి నిర్వహణలో మాకు రిస్క్‌ అధికంగా ఉన్నందునే మాకు పదోన్నతుల్లో పెద్దపీట వేస్తున్న విషయం వాస్తవం. కానీ, ఆఫీసులో కూర్చుని పనిచేసే వారిని, మమ్మల్ని ఒకేగాటిన కడితే ఊరుకునేది లేదని జనరల్‌ విభాగాల ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ, కొందరు ఉన్నతాధికారుల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. దాదాపు నాలుగు దశాబ్దాలక్రితం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.69 లో పేర్కొన్న ఓ అంశం ఆధారంగా సదరు అధికారులు .. నోషనల్‌ సీనియారిటీ ఆధారంగా ఎంటీ, బ్యాండ్, ఆర్మరీ విభాగాలకు చెందిన పలువురి పేర్లతో ఇప్పటికే పదోన్నతుల జాబితాను సిద్ధం చేశారు. దీంతో జనరల్‌ విభాగం వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ వివాదాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీకా వికటించి చిన్నారి మృతి 

పారాచూట్‌ తెరుచుకోక..

ఆమె త్యాగం.. ‘సజీవం’

రేపు సాగర్‌ గేట్లు ఎత్తనున్న ఇరు రాష్ట్రాల మంత్రులు

‘రంగస్థలం’ చిత్రానికి అవార్డుల పంట

ఈనాటి ముఖ్యాంశాలు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

కులు మనాలిలో తెలుగు వ్యక్తి మృతి

ఐరన్‌ బాక్సుల్లో 9 కిలోల బంగారం

ఆ కామెంట్స్‌ బాధ కలిగించాయి : కేటీఆర్‌

తెలంగాణపై కమలం గురి.. పెద్ద ఎత్తున చేరికలు!

'కేసీఆర్‌ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదు'

బెంగళూరు తర్వాత హైదరాబాదీల దూకుడు

ఉప్పొంగిన భీమేశ్వర వాగు 

‘ల్యాండ్‌’ కాని ఎయిర్‌పోర్టు

దూసుకొచ్చిన మృత్యువు.. 

బస్సులో పాము కలకలం

మృగాడిగా మారితే... మరణశిక్షే

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

నేడు ఐఐటీ హైదరాబాద్‌ 8వ స్నాతకోత్సవం

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

భర్తకు తలకొరివి పెట్టిన భార్య

చంద్రయాన్‌–2 ల్యాండింగ్‌ను చూసే అవకాశం

'ఆ' ఇళ్లను తిరిగి ఇచ్చేయండి!

ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ

ఫీడ్‌బ్యాక్‌ ప్లీజ్‌

ఇక సీజ్‌!

నీళ్లు ఫుల్‌

విజయ్‌ " స్వచ్ఛ" బ్రాండ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం