ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతిపై నిరసన

26 Feb, 2015 13:41 IST|Sakshi

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు...బెల్లంపల్లికి చెందిన విఘ్నేష్ మున్సిపల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు బుధవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. అయితే ఇతని మృతికి చైర్‌పర్సన్, కమిషనర్ వేదింపులే కారణమని ఉద్యోగుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల చర్యలను  నిరసిస్తూ గురువారం ఉదయం విఘ్నేష్ మృతదేహంతో మున్సిపల్ కార్యాలయం వైపు బయలుదేరారు. అయితే వారిని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బెల్లంపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

(బెల్లంపల్లి)

మరిన్ని వార్తలు