ప్రజాసేవే ఆర్టీసీ లక్ష్యం  : మహేందర్‌రెడ్డి

27 Jul, 2018 11:18 IST|Sakshi
సన్మానిస్తున్న యూనియన్‌ నాయకులు 

నర్సాపూర్‌ మెదక్‌ : ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ  మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. గురువారం నర్సాపూర్‌లో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

సంస్థ నష్టాల్లో ఉండడంతో దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్‌ వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారని చెప్పారు.  నర్సాపూర్‌ డిపో ఏర్పాటుకు పది కోట్ల రూపాయలను సీఎం మంజూరు చేశారని, ఆరు నెలల్లో డిపోను  ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.  

మంత్రిని సన్మానించిన యూనియన్‌ నాయకులు

మంత్రి మహేందర్‌రెడ్డిని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌  రీజినల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్‌ నాయకులు సంగమేశ్వర్, అహ్మద్, శాఖయ్య, శ్యాంసుందర్‌గౌడ్‌ తదితరులు శాలువ, పూలమాలలతో సన్మానించారు.  డిపో ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం  చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు