నేవీరాడార్‌ ఏర్పాటు చేయొద్దు

6 Dec, 2019 08:12 IST|Sakshi
పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు

పూడూరు జెడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో విద్యార్థుల ధర్నా 

అనుమతులను రద్దుచేయాలని డిమాండ్‌

సాక్షి, పూడూరు: దామగుండం అటవీ ప్రాంతంలో 2,900 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన నేవీరాడార్‌ కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ గురువారం పూడూరు మండల జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో విద్యార్థులు మాట్లాడుతూ.. నేవీ రాడార్‌ ఏర్పాటు చేసి తమకు అన్యాయం చేయరాదని తమకు బతకాలని ఉందని, తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని, తమ ఆరోగ్యాలను పాడు చేయరాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. కేసీఆర్‌ తాత, మోదీతాత మాకు న్యాయం చేయలని కోరారు. నేవీరాడార్‌ ద్వారా విషపూరిత సిగ్నల్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయరాదని వేడుకున్నారు. త్వరలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు, హైకోర్టు న్యాయమూర్తికు పోస్టుకార్డు ద్వారా ఉత్తరాలను రాస్తామని విద్యార్థులు తెలిపారు. 


  

మరిన్ని వార్తలు