‘పుల్వామా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’

19 Feb, 2019 04:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం వనస్థలిపురంలోని సీనియర్‌ సిటిజన్‌ ఫోరంలో వివిధ సంఘాల సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ పూల్వామా ఘటనకు కారకులైన వారికి మరిచిపోలేని గుణపాఠం చెప్పాలని, రానున్న కాలంలో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారత్‌ సత్తాను ప్రపంచానికి తెలియజేసేలా పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎం. మోహన్‌ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.నర్సరాజు, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు హన్మంతరావు, కార్యదర్శి బసవయ్య, సచివాలయనగర్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇ.చంద్రశేఖర్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు