కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి

1 May, 2015 01:12 IST|Sakshi

- అధికారులకు కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశం
- వివిధ పథకాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ముకరంపుర :
రబీలో పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గోనెసంచులు, టా ర్ఫాలిన్తు, తూకం, తేమ కొలిచే పరికరాలు సమకూర్చాలన్నారు.

అలాగే జిల్లాలోని అన్ని నగరాలు, పట్టణాలు, మోడల్ గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులకు కావాల్సిన స్థలాన్ని గుర్తించాలన్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియను గడువులోగా పూర్తి చేయూలన్నారు. అన్ని మండలాల నుంచి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. హరితహారంలో గ్రామస్థారుు ప్రణాళికలను తయారు చేసి కా వాల్సిన మొక్కల వివరాలు వెంటనే పంపాలన్నారు. మిషన్ కాకతీయలో చె రువుల శిఖం భూముల సర్వే చేసి నివేదిక సమర్పించాలన్నారు. మే ఒకటిలో గా పంటనష్టం వివరాలను సంబంధిత పంచాయతీల్లో ప్రదర్శించాలని, 7 లోగా నష్టం వివరాలు సమర్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పౌసమిబసు, ఏజేసీ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు