ఆర్టీసీ డిపోల్లో పోలీసు కంట్రోల్‌ రూమ్‌

9 Oct, 2019 20:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రతి బస్సులో ధరల పట్టిక ఏర్పాటు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్లు ఇతర అధికారులతో పువ్వాడ అజయ్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టికెట్‌ ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ప్రయాణికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి చెప్పారు.

అన్ని డిపోల్లో డీఎస్పీ ఇంచార్జ్‌గా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ప్రతి బస్సులో పాస్‌లను అనుమతించాల్సిందేనని ఆదేశించారు. అన్ని డిపోల నుంచి షెడ్యూల్‌ ప్రకారం బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు