ఖతర్‌ వెళ్లాలంటే వీసా అక్కర్లేదు

11 Aug, 2017 01:28 IST|Sakshi

రాయికల్‌(జగిత్యాల): సౌదీ నేతృత్వంలో అరబ్‌ దేశాల నిషేధంతో సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్‌.. విదేశీ సందర్శకులకు తీపి కబురు అందించింది. 80 దేశాలకు చెందిన వారు తమ దేశంలో పర్యటించాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని ఖతర్‌ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 80 దేశాల్లో భారత్‌తోపాటు యూకే అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఉన్నాయి. ఖతర్‌లో ప్రవేశించే సమయంలో ఎలాంటి రుసుము తీసుకోకుండానే మల్టీఎంట్రీ వేవియర్‌ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికిగాను ఆరునెలలకు తక్కువ లేకుండా వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టుతోపాటు ప్రయాణ టికెట్‌ను చూపించాలి. ఖతర్‌ సందర్శించాలంటే ఇదెంతో దోహదపడుతుందని టూరిజం అథారిటీ చైర్మన్‌ హసన్‌ అల్‌ ఇబ్రహీం ఒక ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు