రైతులకు నాణ్యమైన సోయా విత్తనాలు

25 May, 2019 02:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు నాణ్యమైన సోయా విత్తనా లు సరఫరా చేస్తున్నామని తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు స్పష్టం చేశారు. టెండర్‌ నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. సోయా విత్తనోత్పత్తిలో కంపెనీలు మోసం చేస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుడైన వెంకట్రావు విత్తన ఉత్పత్తి, సరఫరాదారుల సంఘం లెటర్‌ హెడ్‌ను దుర్వినియోగపరుస్తూ, దాని అధ్యక్షుడిగా 3 నెలలు గా ఉన్నతాధికారులు, సంస్థల మీద తప్పుడు ఫిర్యా దులు చేస్తున్నారన్నారు.

నకిలీ సోయా విత్తనాలను విత్తన ధ్రువీకరణ సంస్థ ఏనాడూ ధ్రువీకరించలేదన్నారు. సరైన ఆధారాలు, రైతుల పూర్తి చిరునామా, మూలవిత్తనం సరఫరా చేసిన విత్తనట్యాగులతో సహా సమర్పించిన తర్వాత ఆన్‌లైన్‌లో మాత్రమే విత్తన క్షేత్రాలను నమోదు చేస్తామని వివరిం చారు. కాబట్టి ఎటువంటి అక్రమాలు జరిగే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రైతుల ఆధార్‌ కార్డులు, పట్టా పాస్‌ బుక్‌లు వారికి తెలియకుండా సేకరించడం జరగని పని అని అన్నారు. విత్తన ధ్రువీకరణను నాలుగైదు అంచెల్లో ఉన్న అధికారులతో కూడిన తనిఖీ బృం దాలతో కలిపి చేస్తారన్నారు. మూడేళ్లుగా 18–20 లక్షల విత్తనాలను మన రాష్ట్రానికే కాకుండా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒకే కాన్పులో.. ఇద్దరు బాబులు, ఒక పాప

నాన్న కల నెరవేర్చా

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ప్రభావం.. ఏ మేరకు!

హైదరాబాద్‌ శివార్లో మరో కామాంధుడు

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలి

మద్యం మత్తులో యువతుల హల్‌చల్‌

హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ప్రమాణం 

‘ఉపాధి’కి భరోసా..‘హరితహారం’! 

మెట్రోకు కాసుల వర్షం

‘కార్డు’ కథ కంచికేనా?

సర్కారు బడి భళా..!

65కు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ

కృత్రిమ కిడ్నీ వచ్చేస్తోంది! 

పోలీసులకు కొత్త పాఠాలు

బాల్య వివాహాలు ఆగట్లేవ్‌..!

హోరెత్తిన హన్మకొండ

మున్సి‘పోల్స్‌’పై సందిగ్ధం 

నేడు పలుచోట్ల భారీ వర్షాలు 

ప్రస్తుతం జిల్లాల్లో.. తర్వాత నియోజకవర్గాల్లో! 

ఆరేళ్లయినా అంతంతే!

గురుకుల సీట్లకు భలే క్రేజ్‌ !

త్వరలో మరిన్ని శిల్పారామాలు

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో వివక్ష!

నారాజ్‌ చేయొద్దు

ప్రతి జిల్లాకో శిల్పారామం రావాలి

హరీష్‌రావుకు సవాల్‌ విసిరిన జగ్గారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

డాక్టర్లకు లయన్స్ క్లబ్ సభ్యుల సంఘీభావం

బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో బిజీగా తమన్‌

షాహిద్‌.. ఏంటిది?!

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌

అల్లు వారి ఇంట పెళ్లి సందడి

ఇండస్ట్రీలో అది సహజం : స్టార్‌ హీరో భార్య

సోషల్‌మీడియా సెన్సేషన్‌కు.. తెలుగులో చాన్స్‌