పాఠశాలల్లో క్వారంటైన్‌

16 May, 2020 11:39 IST|Sakshi
తేర్యాల ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్‌లో ఉన్న ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికులు

సొంతూళ్లకు భారీగా తరలివస్తున్న వలస కార్మికులు

గ్రామాల్లోకి అనుమతించని స్థానికులు, ఇళ్లలోనూ స్థలం కొరత

పాఠశాలల్లో క్వారంటైన్‌ చేస్తున్న అధికారులు

అక్కడే భోజన వసతి, రోజుకు రెండుసార్లు వైద్యపరీక్షలు

సాక్షి, యాదాద్రి : బతుకుదెరువు కోసం తదితర ప్రాంతాలకు వెళ్లిన వారు కరోనా వైరస్‌ భయంతో సొంతూళ్లకు తరలివస్తున్నారు. వీరిలో కరోనా లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఆస్పత్రులకు తరలిస్తుండగా మిగతా వారికోసం అధికా రులు ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామాలకు వస్తున్న వలస కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇళ్లలో స్థలం కొరత, స్థా నికులు అనుమతించకపోవడం తదితర కారణాల వల్ల పాఠశాలల్లో క్వారంటైన్‌ చేస్తున్నారు. వారికి భోజనం తదితర సౌకర్యాలను అక్కడే కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150మందిని పాఠశాలల్లో క్వారంటైన్‌  చేశారు. 

సొంత గ్రామాల్లో పరాయిలా..
ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీల బతుకులు దారుణంగా మారాయి. కరోనా వైరస్‌తో ఇంటిబాట పట్టిన వారికి చీదరింపులు, చీత్కారాలు తప్పడం లేదు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యగా చేపట్టిన హోం క్వారంటైన్‌.. వారికి తీరని వేదన మిగిలిస్తోంది. నారాయణపురం మండలం జనగామలో ప్రభుత్వ పాఠశాలలో 14, వావిళ్లపల్లి పాఠశాలలో 9 మంది, రామన్నపేట మండలం ఎల్లంకి పాఠశాలలో 8, చౌటుప్పల్‌ మండలం దేవలమ్మనాగారం 7, పంతంగిలో 12, పీపల్‌పహాడ్‌లో 15, ఎస్‌.లింగోటంలో ఇద్దరు చొప్పున పాఠశాలలో ఉన్నారు. భువనగిరి మండలం చందుపట్లలో 3, భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడి 8, జిబ్లక్‌పల్లి 8 మందిని పాఠశాలలో ఉంచారు. వలిగొండ మండలంలో  150మంది స్వగ్రామాలకు చేరుకోగా ఇందులో 57మందిని మండలంలోని పది పాఠశాలల్లో క్వారంటైన్‌ చేశారు. పాఠశాలలో క్వారంటైన్‌ చేసిన వలస కార్మికులకు  సర్పంచ్‌లు, దాతలు నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, పండ్లు ఇతర అవసరాలు తీరుస్తున్నారు. కొందరికి వారి కుటుంబసభ్యులు ఇళ్ల వద్ద భో జనాలు వండి పంపిస్తున్నారు. భువనగిరి మండలం చందుపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురిని క్వారంటైన్‌లో ఉంచారు. వీరికి ఇప్పటి వరకు గ్యాస్‌ గాని, ఆహారం సదుపాయం కల్పించలేదు.

రామన్నపేట మండలంలోని వెల్లంకి ఉన్నతపాఠశాలలో ముంబయి తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వలసకార్మికులను క్వారంటైన్‌ చేశారు. ప్రస్తుతం పాఠశాలలో ముంబయి నుండి రెండు విడతలుగా వచ్చిన 8మంది వలసకార్మికులు బస చేశారు.మొదటి సారి వచ్చిన ముగ్గురిని ఒక బ్లాక్‌లో ఆ తర్వాత వచ్చిన ఐదుగురు మరో బ్లాక్‌లో ఉండే విధంగా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికొనిన వలస కుటుంలు నేడోరేపో గ్రామానికి రానునాయి. వారిని కూడా పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి కార్మికులకు నిత్యావసర సరుకులతోపాటు గ్యాస్‌స్టవ్‌ మంచినీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. పాఠశాలలో ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోత భరించలేకపోతున్నారు. చాలాకాలం త ర్వాత వచ్చిన తమ కుటుంబ సభ్యులను చూసి  కూడా మాట్లాడలేక పోతున్నామనే ఆవేదన వారిలో కనిపించింది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఇప్పటి వరకు 21కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ముంబయినుంచి  వలస వచ్చిన కార్మికులవే. మరోవైపు జిల్లా వ్యా ప్తంగా 1,316మందిని హోం క్వారంటైన్‌ చేశా రు. 41మందిని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచారు.శుక్రజువజ ్ఛరం చౌటుప్పల్‌ మండలం తంగడపల్లిలో ఇద్దరికి, నారాయణపురం మండలంలో ముంబయి నుంచి వచ్చిన వలస కూలి అయిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. శుక్రవారం నాటికి జిల్లాకు 1,632మంది  చేరుకోగా ఇతర రాష్ట్రాలకు చెందిన 989 మంది వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు