‘క్వారంటైన్‌’కు వెళ్లాల్సిందే!

22 Mar, 2020 01:59 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చినవారిపై పొరుగు ఇళ్లవారి మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: మొన్నటి వరకు కుటుంబ సభ్యుల్లా కలిసి ఉన్నారు.. నేడు కరోనా భూతం అనుమానపు చూపులతో విభజన రేఖ గీసింది. అమెరికా నుంచి వచ్చారు.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని పొరుగిళ్లవారు.. మా ఇల్లు మా ఇష్టం ఇక్కడే ఉంటాం అని ప్రవాసీలు.. ఇదీ ప్రస్తుతం చాలాచోట్ల నెలకొన్న పరిస్థితి. హైదరాబాద్‌ శివార్లలోని అమీన్‌పూర్‌ బందంకొమ్ము ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే కుటుంబం ఇటీవల యూఎస్‌ వెళ్లివచ్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరి కా నుంచి నేరుగా ఇంటికే చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి కోవిడ్‌ లక్షణాలు లేకపోవడంతో పంపించే శారు. అయితే, ఇది ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ఇరుగు పొరుగు ఫ్లాట్ల జ నం.. అమెరికా నుంచి వచ్చారు కదా! క్వారంటైన్‌కు వెళ్లాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో పోలీసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పరీక్షలు చేసేందుకు రా వాలని కోరేందుకు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఇంకేముంది అమెరికా నుంచి వారు అంతెత్తున లేచారు. ఇప్పుడు చాలా అపార్ట్‌మెంట్లలో ఇదే పరిస్థితి...  

వదంతులతో ఇబ్బందులు.. 
చెన్నై ఐఐటీలో చదివే ఓ విద్యార్థికి సెలవులకు ఇంటికి వచ్చాడు. అతడు వచ్చిం ది చెన్నై నుంచైతే.. చైనా నుంచి వచ్చాడనే వదంతి పుట్టింది. అంతే, అధికారులంతా పరుగో పరుగు. ఆపై విషయం తెలిసి నో ళ్లువెళ్లబెట్టారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా లక్ష్మాపూర్‌ తండాలో జరిగింది.

మరిన్ని వార్తలు