మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయ పరిష్కారం  

20 Aug, 2019 02:04 IST|Sakshi
ఆర్బిట్రేటరీ అవగాహన సదస్సులో పాల్గొన్న ఐసీఏడీఆర్‌ రీజినల్‌ ఇన్‌చార్జి మూర్తి

ఆర్బిట్రేటరీ అవగాహన సదస్సులో ఐసీఏడీఆర్‌ రీజినల్‌ ఇన్‌చార్జి మూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్బిట్రేటరీ (న్యాయ వివాదాలకు మధ్యవర్తిత్వం) వ్యవస్థతో వేగంగా న్యాయవివాదాల పరిష్కారం సాధ్యమవుతుందని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్‌నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ (ఐసీఏడీఆర్‌) రీజినల్‌ ఇన్‌చార్జి జేఎల్‌ఎన్‌ మూర్తి అన్నారు. ప్రత్యామ్నాయ న్యాయవివాదాల పరిష్కారాలపై ఇంజినీర్లకు అవగాహన కల్పించేందుకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ఆయన ప్రసంగించారు. మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ వినోభా దేవి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేఎల్‌ఎన్‌ మూర్తి స్వాగతోపాన్యాసం చేస్తూ.. ఆర్బిట్రేటరీలతో ఉన్న ప్రయోజనాలను వివరించారు. రూ.40 లక్షల్లోపు విలువైన పనులకు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడాన్ని ఆయన స్వాగతించారు.

ఇంజినీరింగ్‌ పనుల్లో జాప్యం నివారించి, అభివృద్ధి వేగిరపరిచేలా ఆర్బిట్రేటరీ దోహదపడుతుందన్నారు. కేసుల ఆధారంగా సంబంధిత రంగంలో నిపుణులైన వ్యక్తులు (మెడికల్, ఇంజనీరింగ్, సీఏ, ఫైనాన్స్‌) కేసులు వాదించడంతో సత్వర పరిష్కారం దొరికేందుకు వీలు చిక్కుతుందన్నారు. నచ్చిన సమయంలో, నచ్చిన వేదిక, నచ్చిన భాషను జడ్జిని ఎంచుకునే వీలు ఉండటం దీని ప్రత్యేకత అని వివరించారు. ఆగ్నేసియా దేశాలైన సింగపూర్, మలేసియా ఆర్థికాభివృద్ధిలో ఆర్బిట్రేటరీ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు.

1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన వ్యవస్థకు ప్రధాని మోదీ ఇటీవల చేసిన చట్టసవరణల ద్వారా ఆర్బిట్రేటరీ ద్వారా సులువుగా, వేగంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయవివాదాలు సమసిపోతున్నాయన్నారు. మనరాష్ట్రంలోకూడా పలు కేసుల శీఘ్ర పరిష్కారానికి పలువురు ఆర్బిట్రేటరీని ఆశ్రయిస్తున్నారని వెల్లడించారు. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ పరమైన వివాదాలు, పలు ఇతర ఐపీసీ కేసులను అంతర్జాతీయ ప్రత్యామ్నాయ న్యాయ వివా దాల పరిష్కార వేదిక (ఐసీఏడీఆర్‌) వేగంగా పరిష్కరిస్తుందన్నారు. అనంతరం మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథలో తలెత్తే వివాదాలపై ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యుత్‌ వివాదాలు కొలిక్కి..

ఉలికిపాటెందుకు? 

మూడో విడత కౌన్సెలింగ్‌కు సై 

రిజర్వేషన్లకు లోబడే మెడికల్‌ అడ్మిషన్లు

‘హౌస్‌’ ఫుల్‌ సేల్స్‌ డల్‌

సర్కారు దవాఖానాలకు రోగుల క్యూ

నడ్డా.. అబద్ధాల అడ్డా 

‘వచ్చే నెల 4లోగా టీచర్ల నియామకాలు పూర్తి’

కవితను అడిగితే తెలుస్తుంది బీజేపీ ఎక్కడుందో!

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా

ఈనాటి ముఖ్యాంశాలు

జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా : కేటీఆర్‌

మెడికల్‌ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

‘పాలన మరచి గుళ్ల చుట్టూ ప్రదక్షిణలా?’

చేపల పెంపకానికి చెరువులు సిద్ధం

డిజిటల్‌ వైపు తపాలా అడుగులు

విద్యుత్‌ కష్టాలు తీరేనా.?

గడువు దాటితే వడ్డింపే..

ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..

మత్స్య సంబురం షురూ..      

ఇవేం రివార్డ్స్‌!

‘కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలనుకుంటున్నారు’

సర్పంచులకు వేతనాలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో బుడి‘బడి’ అడుగులు

వెజిట్రబుల్‌!

నోరూల్స్‌ అంటున్న వాహనదారులు

కానిస్టేబుల్‌ కొట్టాడని హల్‌చల్‌

సింగూరుకు జల గండం

కమలానికి ‘కొత్త’జోష్‌..! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌

ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది

థ్రిల్లర్‌కి సై

ఐరన్‌ లెగ్‌ ముద్ర వేశారు