10 ఎకరాల స్థలం.. రూ.10 కోట్ల బడ్జెట్‌

7 Oct, 2017 02:44 IST|Sakshi

బీసీ కుల సంఘాలకు కేటాయించాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌  

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇతర కులాలకు స్థలం, నిధులు కేటాయించిన విధంగా బీసీల్లోని 70 కుల సంఘాలకు హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటా యించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో శుక్రవారం పలు కుల సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.

ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై త్వరలో ప్రధానమంత్రిని కలవనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, సమన్వయకర్త నీల వెంకటేష్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల వెంకటేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, గౌడ జేఏసీ కన్వీనర్‌ అంబలి నారాయణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా