రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి: కృష్ణయ్య

15 Jul, 2018 01:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పిం చాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయస్థానాలు పదే పదే బీసీల రిజర్వేషన్లను తగ్గించాలని తీర్పులను ఇస్తున్నాయని, వీటిని అధిగమించాలంటే వెంటనే రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్‌ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని కోరారు.

ప్రజాస్వామ్య దేశంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని తెలిపారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు రాకపోవడం వల్ల చట్ట సభల్లో చాలా కులాల ప్రాతినిధ్యం తగ్గడం లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల చట్ట బద్ధతకు మద్దతు ఇవ్వాల్సిందిగా దేశంలోని 36 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు