‘ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదు’

21 Aug, 2018 01:17 IST|Sakshi
ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య. చిత్రంలో చెరుకు సుధాకర్‌

హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న 108 అంబులెన్స్‌ ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య అన్నారు.  తెలంగాణ స్టేట్‌ 108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట 108 ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.

108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలుస్తామని కృష్ణయ్య తెలిపారు. అనంతరం జంటనగరాల సం యుక్త కార్మిక శాఖ కమిషనర్‌ గంగాధర్‌ హామీతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఆందోళనలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, పల్లె అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

రిజర్వేషన్ల అమలేది?
కాళోజీ హెల్త్‌ వర్సిటీ రెండో విడత మెడికల్‌ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు సక్రమంగా అమ లు చేయటం లేదని కృష్ణయ్య ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు