యాదాద్రికి మూడంచెల భద్రత

25 Dec, 2016 02:53 IST|Sakshi
యాదాద్రికి మూడంచెల భద్రత

రాచకొండ నేర వార్షిక సమావేశంలో సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌:
ప్రముఖ ఆలయ క్షేత్రం యాదాద్రికి మూడంచెల భద్రతను కల్పించను న్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. టెంపుల్, టెంపుల్‌ టౌన్, వీవీఐపీ జోన్‌లో ప్రత్యేక భద్రతా చర్యలు త్వరలోనే చేపడతామని గచ్చిబౌలిలోని సైబ రాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం రాచకొండ నేర వార్షిక నివేదిక సమావేశంలో ఆయన విలేకరులతో చెప్పారు. తిరుపతి తరహాలో యాదాద్రిలోనూ భద్రత చర్యలు ఉంటాయన్నారు. యాదాద్రి టూరి జం డెవలప్‌మెంట్‌ అథారిటీతో కలసి పని చేస్తున్నామని, ఇందులో భాగంగానే ఐదు కొత్త ఠాణాలు ఏర్పా టు చేస్తున్నామని చెప్పారు. కీసర గుట్టలోని శ్రీరామ లింగేశ్వర స్వామి గుడి, మౌలాలిలోని హజ్రత్‌ అలీ దర్గా, పహడీషరీఫ్‌లోని బాబా సర్ఫుద్దీన్‌ దర్గాలో కూడా శాంతిభద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు.

రాచకొండ కమిషనరేట్‌లోని ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. పోచారంలోని ఇన్ఫోసిస్‌ క్యాంపస్, ఉప్పల్‌లోని జెన్‌ప్యాక్, ఆదిభట్లలోని టీసీఎస్‌ కంపెనీలతో పాటు అనేక ఎంఎన్‌సీ కంపెనీలు ఉన్నాయని పేర్కొ న్నారు. ఆయా కంపెనీల నుంచి ‘మార్గద ర్శక్‌’లను ఎంపిక చేసినట్లు.. వీరు కంపెనీకి, పోలీసులకు మధ్య వారధిగా పనిచేస్తారని వెల్లడించారు. అలాగే యువతులు, ఉద్యోగి ణుల భద్రత కోసం సేఫ్‌ స్టే ప్రాజెక్టుకు సైబ రాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలసి శ్రీకారం చుట్టి నట్లు తెలిపారు. త్వరలో షీ షటిల్‌ బస్సు లు ప్రారంభించబోతున్నామని వివరించారు. అలాగే గ్యాంగ్‌స్టర్‌ నయీంకు సంబంధించి  152 కేసులు నమోదయ్యాయని, తాజాగా 19 మంది బాధితులు తనను ఆశ్రయించగా ఆ కేసులు నమోదు చేయాలని భువనగిరి డీఎస్‌పీని ఆదేశించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు