జోగుళాంబ సన్నిధిలో రఘువీరారెడ్డి

8 Aug, 2018 13:30 IST|Sakshi
ఆలయంలో రఘువీరారెడ్డి,కుటుంబసభ్యులు 

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌): అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్‌ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఏపీ పీసీసీ ప్రసిడెంట్‌ రఘువీరారెడ్డి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించారు.

అనంతరం తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. ఇన్‌చార్జ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ చంద్రయ్య ఆచారి రఘువీరా రెడ్డి దంపతులకు శేష వస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సదానందమూర్తి, వెంకటేశ్వర్లు, పరుషురాముడు, ఖాసీం, నరసింహులు, ప్రేమదాసులు, రాము, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు