కళాశాల బస్సులో ర్యాగింగ్‌

19 Aug, 2017 03:37 IST|Sakshi
కళాశాల బస్సులో ర్యాగింగ్‌
- టీడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల సీనియర్ల దుశ్చర్య
పోలీసుల అదుపులో నిందితులు
 
బీబీనగర్‌ (భువనగిరి): బీబీనగర్‌లోని టీడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి గురువారం ర్యాగింగ్‌కు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని లింగోజిగూడేనికి చెందిన విద్యార్థి గిరిధర్‌ టీడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కళాశాల బస్సులో హైదరాబాద్‌కు వెళ్తుండగా అదే బస్సులో ఉన్న డిప్లొమా మూడో సంవత్సరం విద్యార్థులు సమీర్, నర్సింహ, శశికాంత్‌లు గిరిధర్‌పై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.

బాధితుడు తమ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే సదరు విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్‌ చేస్తామని కరస్పాండెంట్‌ దినేశ్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే ర్యాగింగ్‌ను నిరసిస్తూ కళాశాల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 
మరిన్ని వార్తలు