అగ్రనేత లొచ్చినా..!

12 Dec, 2018 09:05 IST|Sakshi

గెలుపుపై ప్రభావం చూపని జాతీయ స్థాయి నేతలు

అమిత్‌షా, రాహుల్‌ గాంధీ, యోగి ఆదిత్యా నాథ్‌ ప్రచారం చేసినా గెలవని అభ్యర్థులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అగ్రనేతలు, జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేసినా.. ఆయా పార్టీల అభ్యర్థులు నెగ్గలేకపోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్, పరిపూర్ణాన ంద్‌ స్వామి, సీఎం కేసీఆర్‌ తదితరులు తమ పార్టీ ల అభ్యర్థులకు మద్ధతుగా పలుచోట్ల బహిరంగ స భలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రోడ్‌ షో లు సైతం చేశారు. వీటికి ప్రభావితంకాని ఓటర్లు.. చి వరకు తమకు నచ్చిన వారికే ఓటేసి గెలిపించారు.  

వికసించని కమలం..
ఆది నుంచి కల్వకుర్తిపై ఆశలు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి ఈ సారికూడా ఓటమి పా లయ్యారు. ఆయనకు మద్ధతుగా ఈ సె గ్మెంట్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్రమంత్రి సదానందగౌడ, స్టార్‌ క్యాంపెయినర్‌ పరిపూర్ణానంద స్వామి ప్రచారం చేశారు. బహిరంగ సభల వేదికలపై ప్రసంగించి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి కూడా రోడ్‌ షో చేశారు. ఇలా విస్తృత స్థాయిలో పార్టీ అగ్రనేత లు రంగంలోకి దిగినా బీజేపీకి గెలుపు సాధ్యపడలేదు.

పనిచేయని ‘జాతీయ’తంత్రం..
మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి, బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. బీజేపీ తరఫున ఈ సెగ్మెంట్‌లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాలు ప్రచారం నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇక టీఆర్‌ఎస్‌ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహించి.. కారుకు ఓటేయాలని అభ్యర్థించినా విజయం వరించలేదు.

రాహుల్‌ ప్రభావం అంతంతే..
ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పలు సెగ్మెంట్లను చుట్టేసినా.. అక్కడ ఆ పార్టీ అభ్యర్థులకు పరాభవమే ఎదురైంది. కొడంగల్, పరిగి, తాండూర్‌ సెగ్మెంట్లలో బహిరంగ సభలకు హాజరై ప్రసంగించారు. వీటిలో తాండూరు మినహా.. మిగిలిన రెండు చోట్ల కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. తా ం డూరులో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ప్రచారం చే సినా... టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలువలేదు. ఇక బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ప్రచారం నిర్వహించినా.. బీజేపీకి ఇక్కడ సాధ్యం కాలేదు.

మరిన్ని వార్తలు