జైపాల్‌రెడ్డి మృతి ; ప్రధాని మోదీ సంతాపం

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన ప్రజాసేవకే అంకితమయ్యారని, మంచి వక్తగా, పాలనాధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. జైపాల్‌రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించిన గవర్నర్‌ నరసింహన్‌ నివాళులర్పించారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ దిగ్గజ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతిపట్ల చింతిస్తున్నాను. ఆయనొక అసాధారణమైన పార్లమెంటేరియన్‌. తెలంగాణ ముద్దబిడ్డ. జీవితాన్నంతా ప్రజాసేవకే ధారపోసిన గొప్ప నాయకుడు. ఆయన కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

(చదవండి : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత)

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు