ప్రత్యేకత ఉండేనా ‘ప్రభూ’..!

26 Feb, 2015 02:36 IST|Sakshi
ప్రత్యేకత ఉండేనా ‘ప్రభూ’..!

* రైల్వే బడ్జెట్‌పై తెలంగాణ ప్రజల ఆశలు
* ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమేనని ఆవేదన

* ప్రత్యేక రాష్ర్టంలో పెండింగ్‌లకు మోక్షం లభించేనా..?
 
రైల్వే మంత్రి సురేష్‌ప్రభు గురువారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంలోనైనా ప్రత్యేక ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్‌లలో నిధులు కేటాయించి... పనులు ప్రారంభానికి నోచుకోక.. ప్రారంభమైనా పూర్తి కాకుండా ఉన్నవాటికి ఈసారైనా మోక్షం లభిస్తుందనే ఆశతో ఉన్నారు. రైల్వేలైన్లు, కొత్త రైళ్లు, స్టేషన్లలో ఆధునిక సౌకర్యాల కల్పనలో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రైల్వేకోచ్ కర్మాగారం  దక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లోని పరిస్థితులు.  
 - సాక్షి, నెట్‌వర్క్ 
 ఆదిలాబాద్
*  మంచిర్యాల -జద్గల్‌పూర్ (మధ్యప్రదేశ్) వరకు కొత్త రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఉంది. సికింద్రాబాద్ టు బాసర డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలి.
గత బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల-ఆదిలాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రకటించినా నేటికీ సర్వే కూడా ప్రారంభం కాలేదు.
*  2010-11 బడ్జెట్‌లో మంజూరైన ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి, హైదరాబాద్ రైల్వేలైను సర్వే పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు.
*  ఆదిలాబాద్‌లో రూ.17 కోట్లతో రైల్వే బ్రిడ్జి నిర్మాణం అంచనాల దశలోనే ఆగిపోయింది.
  వరంగల్
కాజీపేటకు డివిజన్ హోదా కల్పించాలనే డిమాండ్ కార్యరూపం దాల్చడం లేదు.
* 2012-13 బడ్జెట్‌లో ప్రకటించిన కాజీపేట- విజయవాడ మధ్య మూడోలైన్ నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
*  కాజీపేట మీదుగా సికింద్రాబాద్- నాగ్‌పూర్, సికింద్రాబాద్-విజయవాడల మధ్య హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తామంటూ 2014-15 రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అదే బడ్జెట్‌లో ప్రకటించిన కాజీపేట నుంచి ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రారంభం కాలేదు.
* జిల్లా మీదుగా వెళ్లే డోర్నకల్- మిర్యాలగూడ, మణుగూరు-రామగుండం కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి సర్వేలు చేపట్టినా నిధులు కేటాయించలేదు.
*  రైల్వేబడ్జెట్ 2012-13లో డోర్నకల్ - భద్రాచలం రోడ్డు-మణుగూరు డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
  నిజామాబాద్
*  మోర్తాడ్ నుంచి నిజామాబాద్ వరకు రైలు మార్గం ఏర్పాటు, వివిధ నిర్మాణాలు, స్టేషన్లు తదితర సౌకర్యాల కల్పనకు రూ. 220 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా గత బడ్జెట్‌లో రూ 35 కోట్లు మాత్రమే కేటాయించారు.
* నిజామాబాద్‌తో పాటు డిచ్‌పల్లి, కామారెడ్డి  రైల్వేస్టేషన్‌ను మాడల్ రైల్వేస్టేషన్‌గా ఎంపిక చేసిన నేటి వరకు ఎలాంటి పనులకు నోచుకోవడం లేదు.
  ఖమ్మం
*  భద్రాచలం రోడ్డు-కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణం పూర్తవడం ద్వారానే డోర్నకల్ జంక్షన్‌కు పునర్‌వైభవం సాధ్యం. ఈ లైను నిర్మాణ వ్యయం భరించేందుకు సింగరేణి సంస్థ ముందుకు వచ్చినా పనులు మొదలుకాలేదు.
*  కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న లైన్‌కు సింగరేణి సంస్థ తనవాటా నిధులు విడుదలకు ముందుకు వచ్చినా పనులు రైల్వే శాఖ నుంచి స్పందన లేదు.
  నల్లగొండ
*  సికింద్రాబాద్ - భువనగిరి మార్గంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా మూడోలైన్ నిర్మాణం చేపట్టాలని 15 సంవత్సరాల క్రితం  చేసిన ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.
బీబీనగర్ - నడికుడి మార్గంలో డబ్లింగ్, విద్యుద్దీకరణ  పనులు, మంజూరుకు నోచుకోవడంలేదు.
* ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు పొడిగించాలన్న డిమాండ్ ఎండమావిగానే మిగిలింది.
* నల్లగొండ- మాచర్ల రైల్వే లైన్ నిర్మాణం కోసం  గత దశాబ్దం క్రితం రూపొందించిన ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.
* గద్వాల-దేవరకొండ-నాగార్జునసాగర్-మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు అతీగతీ లేదు.
  మహబూబ్‌నగర్
* ఫలక్‌నుమా నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ లైన్ పనులను సర్వే వరకే పరిమితం.
*  ఒక్క ఆర్‌ఓబీ మాత్రమే పూర్తయింది.
  కరీంనగర్
* కొత్తపల్లి-మనోహరాబాద్ (వయా కరీంనగర్) రైల్వే ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించాలి. సత్వరమే భూసేకరణ  పనులు చేపట్టాల్సి ఉంది.
* ఎరువులు ఇతర వస్తువులను నిల్వ చేసేందుకు కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద వెయ్యి మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో షెడ్ నిర్మాణం చేపట్టాలి.
* పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పనుల్లో భాగంగా మిగిలిపోయిన 28 కి.మీల పనులను పూర్తి చేయాలి.  ఇందుకోసం అవసరమైన రూ.200 కోట్ల మొత్తాన్ని 2015-16 రైల్వే బడ్జెట్‌లోనే మంజూరు చేయాలి.
  రంగారెడ్డి
* కృష్ణా-వికారాబాద్ మధ్య 121.70 కిలోమీటర్ల బ్రాడ్ రైల్వేలైను కలగానే మిగిలింది. సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపాదించినా.. రైల్వే శాఖ నుంచి స్పందన లేదు.
* ప్రతిపాదిత  రైల్వే లైను మక్తల్, లింగంపల్లి, ఉట్కూరు, నారాయణ్‌పేట్, శాసన్‌పల్లి, అబాహంగపూర్, మద్దూర్, నందిపాడ్, కొస్గి, దాదాపూర్, దోమ, పరిగి, నస్కల్, వికారాబాద్ కాగితాలకే పరిమితమైంది.
 
 కాజీపేట వ్యాగన్‌కు లైన్ క్లియర్!

2011-12 బడ్జెట్‌లో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ప్రాజెక్టు ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం దేవాదాయశాఖకు చెందిన కావడంతో భూసేకరణలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు 2015 ఫిబ్రవరి 15న దేవాదాయశాఖకు చెందిన 54.15 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించారు. దీంతో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. దీనికోసం రైల్వేశాఖ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది.
 
 నిధుల్లేక నత్తనడక
 మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర-మునీరాబాద్ పనులు పదేళ్లుగా ముందు కు సాగడం లేదు. దేవరకద్ర నుంచి జక్లేర్ వరకు దాదాపు 65 కిలోమీటర్ల వరకు ఏర్పాటుచేశారు. భూసేకరణ ముందుకు సాగకపోవడం, నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.245 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడం లేదు.   
 
 భూసేకరణా లేదు..
 నల్లగొండ జిల్లా మేళ్లచెరువు నుంచి మఠంపల్లి మీదుగా నేరేడుచర్ల మండ లం జాన్‌పహాడ్ వరకు 100 కోట్లతో నిర్మించేందుకు రైల్వేలైన్ నిర్మాణ పను లు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న పేరెన్నిక గల సిమెంట్ ఫ్యాక్టరీలను కలుపుతూ నిర్మించనున్న ఈ లైన్‌కు ఇప్పటికీ నిధుల మం జూరు లేదు. భూసేకరణ కూడా జరపాల్సి ఉంది.

 మెదక్
 2012-13 బడ్జెట్‌లో 129.32 కోట్లు అం చనా వ్యయంతో అక్కన్నపేట-మెదక్‌కు 17.2 కిలోమీటర్ల మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం సగం ధర భరించడానికి సిద్ధం. భూ సేకరణకు, రైల్వే లైను నిర్మాణానికి నిధులు విడుదలైనా... పనులు ముందుకు సాగలేదు.

>
మరిన్ని వార్తలు