రైల్వే ఐసోలేషన్‌ కోచ్‌లు సిద్ధం

24 Apr, 2020 03:07 IST|Sakshi

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 486 రెడీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులకు సహాయకంగా ఉండేలా రైల్వేశాఖ నాన్‌ ఏసీ కోచ్‌లను ఐసోలేషన్‌ వా ర్డులుగా మార్చేసింది. దేశవ్యాప్తంగా 5 వేల కోచ్‌లను సిద్ధం చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు 486 అప్పగించింది. తాజాగా జోన్‌ పరిధిలో అన్ని కోచ్‌లు ఐసోలేషన్‌ వార్డులుగా సిద్ధమయ్యాయి. ఇలా డివి జన్ల వారీగా..సికింద్రాబా ద్‌ డివిజన్‌ 120 కోచ్‌లు, హైదరాబాద్‌ డివిజన్‌ 40 కోచ్‌లు, లాలాగూడ వర్క్‌షాప్‌ 76 కోచ్‌లు, విజయవాడ డివిజన్‌ 50 కోచ్‌లు, గుంతకల్లు డివి జన్‌ 61 కోచ్‌లు, గుంటూ రు డివిజన్‌ 25, నాంథేడ్‌ డివిజన్‌ 30 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్‌ 84 కోచ్‌లు ఐసోలేషన్‌ గదులుగా రెడీ అయ్యాయి. ఆసుపత్రులు సరిపోని పక్షంలో ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగిస్తారు. ఒక కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఇందులో 8 కూపేలను ఐసో లేషన్‌ వార్డులుగా, ఒక కూపేను సిబ్బంది కోసం కేటాయించారు. ప్రతి కోచ్‌లో స్నానాల గది, మూడు టాయిలెట్లు ఉంటాయి. ప్రతి కూపేలో రెండు బెర్తులు బెడ్లుగా మార్చారు. కూపే కూపేకు మధ్య తెరలను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్య పరికరాలు, విద్యుత్తుపరమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. 

మరిన్ని వార్తలు