రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌ దిగ్బంధం

23 Jun, 2018 13:21 IST|Sakshi
రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద నిరసన తెలుపుతున్న సాక్షర భారత్‌ ఉద్యోగులు  

గంటపాటు సాక్షర భారత్‌ ఉద్యోగుల నిరసన

16వ రోజున అట్టుడికిన ఉద్యోగుల ఆందోళన

సాక్షి, మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌)  : న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సాక్షర భారత్‌ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌ను బుధవారం ది గ్బంధించారు. మండల, గ్రామ కో ఆర్డినేటర్లు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవా రం 16వ రోజుకు చేరాయి. దీక్షలో భాగంగా జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌ దిగ్భంధించారు. జిల్లాలోని 18 మండలా లకు చెందిన మండల, గ్రామ కో ఆర్డినేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోనాలు నెత్తిన పెట్టుకుని బతుకమ్మలతో తరలివచ్చారు.

ఓవర్‌బ్రిడ్జ్‌ వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ నిరసన చేపట్టారు. పురుష ఉద్యోగులు అసైదులా ఆటలు ఆడుతూ రోడ్లపై శీర్షాసనాలు వేశారు. దిగ్భంధం దాదాపు గంటకు పైగా సాగింది. దీంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని సూచించారు. ఉద్యోగులు ససేమిరా అనడంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎంసీఓల సంఘం రాష్ట్ర సభ్యుడు మహేందర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా వీసీఓల అధ్యక్షుడు బోరె శ్రీనివాస్, ఎంసీఓలు, వీసీఓలు లత, సంధ్య, రాజేశం, శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు