పలు పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లు

9 Aug, 2018 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోకోపైలట్, టెక్నికల్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌కు   03242 నంబర్‌ గల సికింద్రాబాద్‌–దానాపూర్‌ ప్రత్యేక రైలు ఆగస్టు 9న సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి ఆగస్టు 11 ఉదయం 7.40కి దానాపూర్‌ చేరుకుంటుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఉమేశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ముజఫరాబాద్, సికింద్రాబాద్‌ మధ్య..
05289 నంబర్‌ గల ముజఫరాబాద్‌–సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ ముజఫరాబాద్‌ నుంచి ఆగస్టు 8న మధ్యాహ్నం 12కి బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే 05290 నంబర్‌ గల స్పెషల్‌ ట్రెయిన్‌ ఆగస్టు 10న రాత్రి 9కి సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి, ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ముజఫరాబాద్‌ చేరుకుంటుంది..

చెన్నై సెంట్రల్‌ నుంచి అహ్మదాబాద్‌కు..  
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చెన్నై సెంట్రల్‌ నుంచి అహ్మదాబాద్‌కు 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 06051 నంబర్‌ చెన్నై సెంట్రల్‌–అహ్మదాబాద్‌ వీక్లీ స్పెషల్‌ ఫేర్‌ ట్రెయిన్లు చెన్నై సెంట్రల్‌ నుంచి ఆగస్టు 11, 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో (శనివారాలు) రాత్రి 8.10 నుంచి బయల్దేరి ఉదయం 5.45 గంటలకు (సోమవారాలు) అహ్మదాబాద్‌ చేరతాయి. 06052 నంబర్‌ అహ్మదాబాద్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వీక్లీ వీక్లీ స్పెషల్‌ ఫేర్‌ ట్రెయిన్లు అహ్మదాబాద్‌ నుంచి ఈనెల 13, 20, 27, సెప్టెంబరు 3, 10, 17, 24, అక్టోబరు 1 (సోమవారాలు)న ఉదయం 9.40 నిమిషాలకు బయల్దేరి (మంగళవారాలు) సాయంత్రం 5.10కి చెన్నై సెంట్రల్‌ చేరుకుంటాయి.  

మరిన్ని వార్తలు