నేడు, రేపు మోస్తరు వర్షాలు

19 Jul, 2018 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనంగా మారి తూర్పు మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 21న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో వర్షపాతం నమోదైన ప్రాంతాలు:
డోర్నకల్‌ (మహబూబాబాద్‌) 4 సెం.మీ, అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం) 3 సెం.మీ, వెంకటాపూర్‌ (జయశంకర్‌ భూపాలపల్లి) 2 సెం.మీ, సత్తుపల్లి (ఖమ్మం) 2 సెం.మీ, రామగుండం (పెద్దపల్లి) 2 సెం.మీ, గోవిందరావు పేట (జయశంకర్‌ భూపాలపల్లి) 2 సెం.మీ, జూలూరుపాడు (భద్రాద్రి కొత్తగూడెం) 2 సెం.మీ, బాల్కొండ (నిజామాబాద్‌) 2 సెం.మీ, ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) 2 సెం.మీ.

మరిన్ని వార్తలు