మూడు రోజులు మోస్తరు వర్షాలు

28 Jul, 2018 01:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నందున దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తువరకు, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరప్రాంతం దాని పరిసర ప్రాంతాలలో 6 నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దీని ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజులలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర మరియు ఉత్తర కోస్తా, తమిళనాడు తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 7.6 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
శ్రీరాంసాగర్‌ (నిర్మల్‌) 2 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ 1 సెం.మీ, గుండాల 1 సెం.మీ, భద్రాచలం 1 సెం.మీ, కల్వకుర్తి (నాగర్‌కర్నూల్‌) 1 సెం.మీ.

>
మరిన్ని వార్తలు