లాక్‌డౌన్ ఉల్లంఘ‌న.. రాజాసింగ్ ఫైర్‌

16 May, 2020 08:21 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్: లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాలాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ద‌బీర్‌పుర ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిపై ఉన్నబారికేడ్‌‌ను బ‌ల‌వంతంగా తొల‌గించారు. దీంతో బ‌లాలాతోపాటు ఎంఐఎం మిగ‌తా ఎమ్మెల్యేలు హైద‌రాబాద్ ఓల్డ్ సీటీలో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని, వీరిపై చ‌ర్చ‌లు రాజా సింగ్ కోరారు. కాగా బారికేడ్లు తొలిగించే ముందు మ‌జ్లిస్ ఎమ్మెల్యే అహ్మ‌ద్ బ‌లాలా మీర్‌చౌక్ ఏసీపీ నుంచి అనుమ‌తి తీసుకున్నారని ద‌బీర్‌పుర పోలీసులు తెలిపారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 21 మంది మృతి )

రాజాసింగ్ మాట్లాడుతూ.. ఓ వైపు క‌రోనాతో దేశం పోరాడుతుంటే బ‌లాలా వంటి ఎంఐఎం పార్టీ నేత‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. అధికారుల ఆదేశాలు పాటించ‌కుండా పోలీసుల‌కు, డాక్ట‌ర్ల‌కు ఇబ్బంది క‌లిగిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అస‌లు ఈ చ‌ర్య‌ల‌న్నింటి వెన‌క ఎంపీ అస‌దుద్దీన్‌ ఓవైసీ హ‌స్తం ఉందని ఆరోపించారు. ఓ వైపు ప్ర‌జ‌ల‌కు మంచిగా క‌నిపిస్తూ మ‌రోవైపు త‌న ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్ల‌తో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌మ‌ని ఒవైసి ప్రేరేపిస్తున్నారని విమ‌ర్శించారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన ప్ర‌తి ఒక్క‌రిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాజాసింగ్ కోరారు. (గ్రేటర్‌ ఆర్టీసీ.. కండక్టర్‌ లెస్‌ సర్వీసులు! )

ఫ్లైఓవర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అబ్దుల్లా బ‌లాలా

మరిన్ని వార్తలు