ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి

21 Aug, 2018 13:14 IST|Sakshi
జ్యోతినగర్‌: పలకలు అందిస్తున్నప్రసన్నకుమార్‌

గోదావరిఖని (కరీంనగర్‌): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని సోమవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి శాప్‌ మాజీ చైర్మన్, కాంగ్రెస్‌ నాయకులు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్, టీపీసీసీ సెక్రటరీ బడికెల రాజలింగం రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. రాజీవ్‌గాంధీ ప్రధాని సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు రూపొందించి, పంచాయతీ రాజ్‌ చట్టాన్ని ప్రారంభించారని తెలిపారు. 2019 ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో నాయకులు ఎం.రవికుమార్, ఎండీ ముస్తాఫా, శ్రీనివాసరావు, రాజేష్, యుగేంధర్, ఫకృద్దీన్, మధు,  శ్రీనివాస్, లక్ష్మణ్, శేఖర్, నజీమొద్దీన్, ఎండీ రహీం, మహేష్, ఫయాజ్‌ అలీ, సర్వర్, శ్రీనివాస్, విజయ్, సూరి, సుల్తాన్‌కుమార్, సతీష్‌ పాల్గొన్నారు.
 
రామగుండంలో..
రామగుండం:  రామగుండం పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వాజీద్‌ఖాన్‌ రాజీవ్‌గాంధీ ప్రధాని హయంలో దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రఫీఉద్దీన్, యాసిన్‌బేగ్, గౌస్‌బాబా, అజీంపాషా, నరేష్, యాదగిరి, జావీద్‌ఖాన్‌ తదితరులున్నారు. అంతర్గాం మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు సత్తయ్యగౌడ్, రాజేంద్రప్రసాద్, రాజేందర్, శ్రీనివాస్,  శ్రీనివాస్, పోశం, శ్రీనివాస్‌రెడ్డి, రత్నాకర్‌రెడ్డి, హన్మాన్‌రెడ్డిలున్నారు.

ఎన్టీపీసీలో రాజీవ్‌ సద్భావనదివస్‌ ప్రతిజ్ఞ
జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండం  ప్రాజెక్టు పరిపాలనా భవనంలో సద్భావన దివస్‌ ప్రతిజ్ఞ చేశారు. సోమవారం రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన దివస్‌లో భాగంగా హిందీ, ఇంగ్లిష్‌ భాషలలో ఎగ్జిక్యూటివ్‌ రవీంద్ర సద్భావనా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి సంవత్సరం ఆగష్టు–20 న  ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు జాతీయ సమైక్యత, శాంతి, జాతీయ సమగ్రత, ప్రేమ కలిగి ఉం డాలన్నారు. జనరల్‌ మేనేజర్లు‡ బాబ్జి, యం.ఎస్‌.రమేశ్‌తో పాటు అధికారులున్నారు.

ఇందిరమ్మకాలనీలో...
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ చీప్‌ ఆర్గనైజర్‌ గోలివాడ ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్‌ 3వ డివిజన్‌ ఇందిరమ్మకాలనీలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం చిన్నారులతో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలను పంచి పెట్టారు. అంగన్‌వాడీ కేంద్రం విద్యార్థులకు పలకలను అందజేశారు.  సేవాదళ్‌ నాయకులు బొద్దున రాజేశం, జబ్బార్, శ్రీశైలం, చంద్రయ్య, చిలుక రాంమూర్తి, శ్రావణ్, లింగయ్య, కళ్యాణ్, కుమార్‌ నాయక్, సంపత్‌రావు, కల్వల రాజు, సత్యనారాయణ, సదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా