జడ్చర్లలో రాజీవ్‌ కనకాల సందడి   

20 Jun, 2018 13:35 IST|Sakshi
ఎస్‌ఆర్‌ఓతో మాట్లాడుతున్న రాజీవ్‌ కనకాల   

జడ్చర్ల :  జడ్చర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సినీనటుడు రాజీవ్‌ కనకాల బుధవారం కొద్దిసేపు సందడి చేశారు. ఆయన బాలానగర్‌ మండలంలోని హేమాజీపూర్‌ గ్రామ శివారులో గల తన సొంత భూమికి సంబందించి బ్యాంకు లోన్‌ నిమిత్తం తనఖా పెట్టేందుకు కార్యాలయానికి వచ్చారు.

ఈ సందర్బంగా ఆయన స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ అశోక్‌తో మాట్లాడి నిబందనల మేరకు సంతకాలు చేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న కొందరు ఆయనను చూసేందుకు వచ్చారు. మరికొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు